తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా వింబుల్డన్ చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన అమె అదే జోరులో.. హుషారుగా టైటిల్ ను సొంతం చేసుకున్నారు. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోకి దూసుకెళ్లిన సానియా జోడి టైటిల్ ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో తన స్విట్జార్లాండ్ పార్ట్ నర్ మార్టినా హింగీస్ తో కలసి టైటిల్ ను దక్కించుకుంది. హింగీస్ తో కలసి ఇటీవల పలు విజాయాలను నమోదు చేసుకున్న సానియా.. తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ ను సొంతం చేసుకుని తన ఆనంధాన్ని వ్యక్తం చేసింది.
ఇవాళ జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్స్ లో రష్యాకు చెందిన ఎకటెరినీ మకరోవా, ఎలినా వెస్నినా జోడిని సానియా జోడీ ధీటుగా ఎదుర్కోంగి. తొలి సెట్ లో ఓటమిని చవిచూసిన సానియా జోడి.. రెండో సెట్ పైచేయిని సాధించింది. మూడో సెట్ లో కూడా అత్యద్భుతంగా రాణించడంతో టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి సెట్ లో ఓటమి నేపథ్యంలో.. రెండో సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా.. చివరకు సానియా జోడీనే విజయం వరించింది. ఆద్యంతం ఉత్కంఠభరింతంగా సాగిన ఈ పో రులో మూడో సెట్ కూడా హై టెన్షన్ మద్యే సాగినా.. సానియా జోడి మెరుగైన ఆటతీరుతో రాణించడంతో విజయం వరించింది. వింబుల్డన్ లో విజయాన్ని నమోదు చేసుకున్న సానియా మిర్జాకు భారత్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more