భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తొలిసారిగా.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్ర సృష్టించడంతో అమెను మహిళా టెన్నీస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ టైటిల్ గెలుపుతో డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచన సానియాను సన్మానించిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత హాజరయ్యారు. సానియా మిర్జాను సన్మానించిన అనంతరం ప్రతిష్మాత్మక వింబుల్డన్ గెలిచినందుకు అమె అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళా టెన్నీస్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని చెప్పారు. వింబుల్డన్ ను సానియా గెలవడం తెలంగాణాకే కాకుండా యావత్ దేశానికి కూడా గర్వకారణమని చెప్పారు. టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవాతో కలసి సానియాను సన్మానించారు. అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ నెంబర్ వన్ ర్యాంక్ సాధించడానికి తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తాను సాధించిన ఈ విజయంతో భారత అమ్మాయిలు ఏదైనా సాధించవచ్చని నమ్మతారని బావిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ డైరెక్టర్ మెలిస్సా పైన్ మాట్లాడుతూ.. తాము అనేక డబ్యూటీఏ ఈవెంట్లను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తే ఇక్కడ కూడా నిర్వహిస్తామని చెప్పారు. మెలిస్సా పైన్ వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ కవిత.. తమ ప్రభుత్వం మహిళా టెన్నీస్ అసోసియేషన్ ఈవెంట్లకు హాస్ట్ గా వ్యవహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. అయితే కార్యక్రమాల నిర్వహణకు పై పూర్తి ప్రతిపాదిత నివేదికను సమర్పించాల్సిందిగా అమె కోరారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more