Virender sehwag unfazed about ipl 2014 auctions

IPL 2014 auctions, IPL 2014 auction highlights, Virender Sehwag,IPL 7 auction, IPL 7 players auction,Kevin Pietersen, Quinton De Kock, Virender Sehwag and Yuvraj Singh.

Virender Sehwag unfazed about IPL 2014 auctions

అతి తక్కువుగా అమ్మడుపోయిన ఆటగాళ్లు .

Posted: 02/13/2014 05:00 PM IST
Virender sehwag unfazed about ipl 2014 auctions

‘‘బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు  బండ్లు అవుతాయి అంటే ఇదే.’’  గత మూడేళ్ల క్రితం  ఐపిఎల్ -4(2011) లో రికార్డు స్థాయిలో  రేటు పలికిన ఆటగాళ్లు  ఐపిఎల్ -7లో .. అతిదారుణంగా.. తక్కువ ధరకు అమ్ముడు పోయారు.  ఆ ఆటగాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కావచ్చు లేదా ఫ్రాంచైజీల ఆలోచనా ధోరణి, వ్యూహాల్లో వచ్చిన మార్పు కారణమేదైనా కావచ్చు. 

 రత క్రికెట్‌లో విధ్వంసకరమైన బ్యాటింగ్‌కు ప్రతిరూపంగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ ధర భారీగా తగ్గిపోవడం ఈ ఏడాది పెద్ద సంచలనం. గత వేలంలో భారీ మొత్తాన్ని ఇంటికి తరలించిన పఠాన్ బ్రదర్స్ విలువ ఈ సారి పూర్తిగా తగ్గిపోయింది. ఉతప్ప, సౌరభ్ తివారీలు గతంతో చాలా తక్కువ మొత్తానికే అమ్ముడుపోయారు.

 కొంతమంది ఆటగాళ్లకు అనుకున్న స్థాయికి మించిన ధర పలికింది. భారీ రికార్డు మొత్తాలు కాకపోయినా, మరీ ఆయా ఆటగాళ్ల విలువను తగ్గించే ధర మాత్రం పలకలేదు. కలిస్, వార్నర్, జాన్సన్, మైక్ హస్సీ, బ్రెండన్ మెకల్లమ్, మురళీ విజయ్, మ్యాక్స్‌వెల్ తదితరులు వేలంలో చెప్పుకోదగ్గ ధరకే అమ్ముడుపోయారు. 

ఇక స్టీవెన్ స్మిత్, డి కాక్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీవంటి ఆటగాళ్లు ఇటీవల చక్కటి ప్రదర్శనతో తమ స్థాయికి పెంచుకున్నారు. కౌల్టర్ నీల్, స్టార్క్‌లాంటి పేస్ బౌలర్లకు అనూహ్య ధర పలకగా...అండర్సన్‌కు ఊహించినంత కాకపోయినా మంచి విలువే దక్కింది.

మరికొంతమందికి నిజంగా అవమానం జరిగినట్లు గా ఉంది. టి20ల్లో మంచి ప్రదర్శన ఇవ్వగల సామర్ధ్యం ఉన్నా కొంత మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ముఖ్యంగా గత సీజన్లలో కెప్టెన్లుగా వ్యవహరించిన జయవర్ధనే (శ్రీలంక), వైట్,  డేవిడ్ హస్సీ, క్రిస్టియాన్ (ఆస్ట్రేలియా), టేలర్ (న్యూజిలాండ్) లను ఏ జట్లూ తీసుకోకపోవడం ఆశ్చర్యం. 

అలాగే శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, స్టార్ ఆటగాడు దిల్షాన్‌నూ పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం ఓ వెలుగు వెలిగిన భారత బౌలర్ ప్రవీణ్‌నూ ఎవరూ తీసుకోలేదు. ధోనికి సన్నిహితుడు ఆర్పీసింగ్‌నూ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.  ఇలా ఆటగాళ్లు నిరాశతో మిగిలిపోయారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles