Sri lanka beat india to win t20 world cup title

world twenty20 2014, cricket, india, sri lanka, kumar sangakkara, virat kohli, ms dhoni, Jayawardene, Sangakkara

Sri Lanka beat India to win T20 World Cup title, india, sri lanka, world twenty20 2014

18 ఏళ్ళ తరువాత గర్జించిన సింహాలు

Posted: 04/07/2014 10:48 AM IST
Sri lanka beat india to win t20 world cup title

ఒక జట్టేమో రెండో సారి తన ఖాతాలో కప్ ని వేసుకోవాలనే ఆరాటం... మరో జట్టేమో గత 18 సంవత్సరాల నుండి అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ ని ఎలాగైనా సాధించాలనే పట్టుదల. ఆ పట్టుదలే రెండోసారి కప్ సాధించాలనే ఆరాటపడ్డ జట్టును ఓడించి తన కప్ దాహాన్ని తీర్చుకుంది.

ఇది శ్రీలంక – ఇండియా మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ స్టోరీ. ఇక మొన్నటి వరకు పేవల ప్రదర్శనతో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత్ లీగ్ నుండి సెమీ ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరి అందర్ని ఆశ్చర్యపరచడమే కాకుండా, కప్ కూడా సాధిస్తుందని ఆశ పడ్డ యావత్ భారత అభిమానుల ఆశల పై నీళ్ళు చల్లుతూ ఫైనల్లో ఓడిపోయింది. 

షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలి టి20 వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి భారత్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించిన లంక ఆది నుండి కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారత బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. .

రోహిత్ శర్మ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు) విరాట్ కోహ్లి (58 బంతుల్లో 77; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తప్ప మిగతా వాళ్ళు ఎవరూ రాణించలేక పోయారు.  యువరాజ్ (21 బంతుల్లో 11) టి20ల్లో తన కెరీర్‌లోనే అతి చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. ధోని (7 బంతుల్లో 4 నాటౌట్) కూడా ఆకట్టుకోలేకపోయాడు. లంక బౌలర్లు చివరి 5 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.

భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని లంకేయులు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు అలవోకగా సాధించి విజయాన్ని సాధించారు. లంక బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్ దిల్షాన్ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు), జయవర్ధనే (24 బంతుల్లో 24; 4 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఇక సంగక్కర (35 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) తన చివరి మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో లంక దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనే తమ టి20 అంతర్జాతీయ కెరీర్‌నుఘనంగా ముగించారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles