Bollywood actress anushka sharma stay with virat kohli in england tour which goes viral

anushka sharma, anushka sharma hot photos, anushka sharma virat kohli, anushka sharma virat kohli news, virat kohli, bcci sanjay patel

bollywood actress anushka sharma stay with virat kohli in england tour which goes viral : bcci senior officer question that why anushka sharma stay with virat kohli in england tour. and how bcci give this permission

ఇంగ్లాండ్ లో అనుష్కతో పండగ చేసుకున్న విరాట్!

Posted: 08/21/2014 06:18 PM IST
Bollywood actress anushka sharma stay with virat kohli in england tour which goes viral

ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా టీమిండియా ఘోరంగా పరాజయాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే! ఈ పరాభవానికి కారణం కేవలం ధోనీయే అంటూ అందరూ అతని మీద ఆరోపణలు గుప్పించారే కానీ... అతనితోపాటు మిగతా ఆటగాళ్లు కూడా మరింత ఘోరమైన విషయాన్ని బీసీసీఐ, దేశప్రజలు గుర్తించలేనట్లున్నారు. టీమ్ కెప్టెన్ అయినంత మాత్రాన తానొక్కడే భారాన్ని మోసుకుని మ్యాచ్ ని గెలిపించాలన్న రూలేమీ లేదు... తన జట్టు ఆటగాళ్లు సరిగ్గా ప్రదర్శించకపోవడమే టీమిండియా ఓడిపోవడానికి ప్రథమ కారణం!

ఒకవైపు ఇండియా జట్టు టెస్టు సిరీస్ లో వరుసగా ఓడిపోతుంటే... మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతో కలిసి పండగ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో ఇండియా బయలుదేరుతున్న నేపథ్యంలో ఎవ్వరికీ తెలియకుండా విరాట్, అనుష్క శర్మనూ తనతోపాటు తీసుకెళ్లాడు. ఏ మీడియా కంటపడకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. ఇంకేముంది! ఇద్దరూ మాంచి వేడెక్కి వున్నారు... ప్రైవసీ దొరికేసింది... వీలున్నప్పుడల్లా సినిమాలు, షికార్లు, పబ్బులు అంటూ తెగ తిరగేశారు. ప్రాక్టీస్ మ్యాచులకు అటెండ్ అయినా కూడా మనోడి ధ్యాస మాత్రం కేవలం అనుష్కపైనే! ఎప్పుడెప్పుడు రిలీవ్ దొరుకుతుందా.. ఎప్పుడెప్పుడు అనుష్కతో సమయం గడుపుదామా అన్న ఆలోచనలే మెదడులో తిరగేసుకునేవాడు. అంతెందుకు.. గ్రౌండ్ లో అడుగుపెడితే చాలు.. తన బాదుడుతో ఫీల్డర్లను పరిగెత్తించే మన కుర్రోడు.. ఈసారి టెస్టు మ్యాచుల్లో ఘోరంగా విఫలమవుతూ పవెలియన్ కు వెనుతిరిగి వచ్చేసేవాడు. ఇదంతా అనుష్క శర్మ ప్రేమ మాయే మరి!

ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐలో ఓ అధికారి ప్రకటించాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యానికి అసలు కారణం కేవలం బాలీవుడ్ భామ అనుష్మ శర్మయే అంటూ వాదనలను వినిపిస్తున్నారు. వీరిద్దరూ తమ సరదాలను తీర్చుకోవడానికి సమయం సరిపోయింది కానీ.. విరాట్ కు మ్యాచ్ మీద ధ్యాసే లేకుండా పోయిందంటూ ఆయన వాపోతున్నాడు. టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన విరాట్ కోహ్లీకి అనుష్క శర్మతో ఏం పని వుందని ఆయన ప్రశ్నలను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కోహ్లీతోపాటు అనుష్క శర్మను ఇంగ్లాండ్ కు వెళ్లేందుకు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

‘‘బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం క్రికెటర్లు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు వారితోపాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. అంతేకానీ పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను విదేశీ టూర్లకు తీసుకెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. అయితే కోహ్లీ ఇంగ్లాండ్ టూర్ కు తనతోపాటు అనుష్కను కూడా తీసుకెళతానంటే.. ఏమాత్రం ఆలోచన లేకుండా బీసీసీఐ వెంనటే ఎలా అనుమతించింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఎలా తీసుకున్నారు’’ అంటూ ఒక ఉన్నతాధికారి వివరించాడు. అంతేకాదు.. అనుష్కశర్మ, కోహ్లీతో కలిసి టీమిండియా బస చేసే హోటల్ లో వుండేందుకు అనుమతించాలని స్వయంగా సంజయ్ పటేల్ తన టీం మేనేజ్ మెంట్ ను తెలిపినట్టు ఆ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. అనుష్క శర్మ పీకల్లోతుదాకా ప్రేమకలాపాల్లో మునిగిపోవడం వల్లే కోహ్లీ ఇంగ్లాండ్ టూర్ లో రాణించలేకపోయాడని క్రీడా పరిశీలకులతోపాటు దేశ అభిమానులు కూడా వాదనలను వినిపిస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  bcci chairman sanjay patel  india vs england matches  

Other Articles