Bcci reveals the marriage life of anushka sharma and kohli

bcci, anushka sharma, virat kohli, england tour, anushka sharma virat kohli, bcci officers, bcci officials, anushka sharma hot photo shoot, anushka with virat kohli

bcci reveals the marriage life of anushka sharma and kohli : bcci clarifies that kohli and anushka will get married soon. so that's why they gave permission to go anushka along with kohli in england tour

బీసీసీఐ సమక్షంలో కోహ్లీ, అనుష్కల పెళ్లి!

Posted: 08/22/2014 11:29 AM IST
Bcci reveals the marriage life of anushka sharma and kohli

భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇన్నాళ్లవరకు తమ మధ్య వున్న ప్రేమబంధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఇక వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించి ఎన్నోరకాల రూమర్లు, పుకార్లు బాగానే చక్కర్లు కొట్టాయి. వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇకనుంచి అటుంటి వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని ఇప్పుడు సమాచారాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని బహిర్గతం చేసింది మరోవరె కాదు... స్వయంగా బిసిసిఐ అధికారులే! కోహ్లీ వ్యక్తిగత జీవితంతో బిసిసిఐకి ఎటువంటి సంబంధం లేకపోయినా... పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగానే దూరిపోయినట్టు కనిపిస్తోంది.

ఇంతకు జరిగిన విషయం ఏమిటంటే... ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఎంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత్ కు భూతంగా మారిన ‘‘లార్డ్స్’’ మైదానంలో సైతం అద్భుతంగా తమ ప్రతిభను కనబరిచి 28 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్... సిరీస్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలేంటని టీం మేనేజ్ మెంట్ తోపాటు క్రికెట్ అభిమానులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. టీమిండియా ఇంత దారుణంగా ఓడిపోవడంతో.. నిన్నటిదాకా పొగడ్తలతో ముంచెత్తిన కోచ్ డంకన్ ఫ్లెచర్ ను ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక రెండోసారి భారత్ కు ప్రపంచకప్ ను గెలిపించిన ధోనీ నాయకత్వంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైస్ కెప్టెన్ కోహ్లీ మీద కూడా తీవ్రంగా కామెంట్లు చేశారు. మొత్తం మీద అందరి ఆటగాళ్లపై రకరకాల విమర్శలను గుప్పిస్తున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా బిసిసిఐ ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. టీమిండియా ఘోరంగా ఓడిపోవడానికి ముఖ్యకారకుల్లో కోహ్లీ కూడా ఒకడంటూ తేల్చి చెప్పిన బిసిసిఐ.. ఇప్పుడు ఏకంగా తన వ్యక్తిగత జీవితంలో తలదూర్చేసింది. కోహ్లీ తనతోపాటు అనుష్కశర్మను కూడా ఇంగ్లాండ్ టూర్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే! అది ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో ఇంతవరకు మనం వింటూనే వున్నాం. ఇప్పుడు ఆ విషయం మీద మరో కొత్త అంశం బయటపడింది. అనుష్క శర్మను తనతో తీసుకెళ్తానంటూ కోహ్లీ అడగ్గానే బిసిసిఐ ఏమీ ప్రశ్నించకుండానే సరేనని ఎందుకు ఒప్పుకుందో విశ్లేషణ చెప్పుకుంది. ‘‘కోహ్లీ, అనుష్కలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం తెలియడం వల్లే కోహ్లీ వెంట అనుష్కను వెళ్లేందుకు అనుమతినిచ్చాం’’ అంటూ బిసిసిఐ అధికారు ఒకరు కుండబద్ధలు కొట్టేశారు.

‘‘ఏ ఆటగాడైనా టూర్ లో భాగంగా విదేశాలకు వెళ్తున్నప్పుడు అతనితోపాటు అతని భార్య, పిల్లల్ని తీసుకెళ్లేందుకు అనుమతినిస్తారన్న మాట వాస్తవమే. అయితే ఇక్కడ కోహ్లీ త్వరలోనే అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. దీంతో మేము అంగీకరించాల్సి వచ్చింది. అంతేకానీ.. ఇందులో మా ప్రత్యామ్నాయం ఏమీ లేదు’’ అంటూ బిసిసిఐ స్పష్టం చేసింది. మరి ఈ విషయం మీద అనుష్క, కోహ్లీలు ఎలా స్పందిస్తారో.. ఇంకా ఇది ఎన్ని దుమారాలను రేపుతుందో..? వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారా లేదా..? అన్న ప్రశ్నలను అభిమానులు లేవనెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  virat kohli  bcci  celebrities marriages  

Other Articles