Bcci warning to mahendra singh dhoni to control himself

mahendra singh dhoni, mahendra singh dhoni captain, duncan fletcher, bcci board members, team india, indian team oneday matches

bcci warning to mahendra singh dhoni to control himself : the indian captain mahendra singh dhoni said that fletcher will continue as coach till next world cup. but the bcci denied dhoni's statement and gave warning to him

ధోనీనీ మూసుకోమ్మని గట్టి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ!

Posted: 08/25/2014 05:49 PM IST
Bcci warning to mahendra singh dhoni to control himself

ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ లో అతి దారుణంగా విఫలం అయిన టీమిండియాపై బీసీసీఐ బోర్డుతోసహా మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఇక కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెచర్ పై తీవ్ర విమర్వలు గుప్పించేశారు. ధోనీ కెప్టెన్ గా, ఫ్లెచర్ కోచ్ గా పనికిరాడని.. వారిద్దరినీ వెంటనే ఆయా హోదాల నుంచి తప్పించాల్సిందిగా అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో టీమిండియా ఘోరంగా పరాజయం కావడంతో జట్టు ఆటగాళ్లపై కొంత జరిమానా విధించగా... కోచ్ ఫ్లెచర్ ను పక్కనపెట్టేశారు. అతని స్థానంలో ఇంకొక కోచ్ ను ఎన్నుకునే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది. ప్రస్తుతానికి వన్డే మ్యాచులకుగాను టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రిని నియమించింది.

ఇదిలావుండగా.. తాజాగా ధోనీ ‘‘వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా కోచ్ గా డంకన్ ఫ్లెచర్ కొనసాగుతాడు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇతను ఈ మాటలు అనడమే ఆలస్యం.. వెంటనే ఇతనిపై బీసీసీఐ వర్గాలు విరుచుకుపడ్డాయి. ధోనీ తన నోరును కాస్త అదుపులో వుంచుకుంటే బాగుంటుందనే ధోరణిలో తీవ్రంగా మండిపడింది. ‘‘కోచ్ గా ఎవరుండాలనో నిర్ణయించే హక్కు ధోనీకి లేదు. అతను నిర్ణయించలేడు’’ అంటూ ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ‘‘వచ్చే వరల్డ్ కప్ కు టీమిండియా కోచ్, కెప్టెన్ గా ఎవరు వ్యవహరించాలనేది సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. విండీస్ తో జరిగే సిరీస్ లోపు ఫ్లెచర్ తప్పుకుంటే మంచిదేనంటూ అతనికి బీసీసీఐ నోటీసులు కూడా పంపింది.

ప్రస్తుతం జరగబోయే వన్డే మ్యాచుల్లో ధోనీ తన దృష్టిని కేంద్రీకరించాలని.. అందులో విజయం సాధించాలంటూ అతనికి సూచనలు కూడా చేసింది. ఒకవేళ వన్డే మ్యాచ్ సిరీస్ లో కూడా టీమిండియా ఓడిపోతే.. కెప్టెన్ గా ధోనీ వైదొలగడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ఎంత వరల్డ్ కప్ గెలిపించినా.. తర్వాత జరగబోయే మ్యాచుల్లో గెలిపించకుండా వుంటే కెప్టెన్ గా కాదు కదా... జట్టునుంచే తొలిగించే శక్తి బీసీసీఐకి వుందంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ధోనీ దూకుడుగా కాకుండా.. తెలివిగా వ్యవహరిస్తే చాలా బాగుంటుందని అతనికి హెచ్చిరకలు జారీ చేస్తున్నారు. మరి ధోనీ వన్డే సిరీలో లో జట్టును రాణిస్తాడా.. లేకపోతే టెస్టుల్లాగే చాప చుట్టేసుకుని వెనుదిరిగి వస్తాడా..? అనేది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  duncan flether  bcci board members  

Other Articles