Darrell hair says umpires timid encouraged chucking

cricket, cricket news, latest cricket updates, indian cricket team, indian cricketers, indian cricket team photos, indian cricket team list, cricket matches, indian cricket matches, indian cricket highlights, chucker, chucking, chuck, chucking in cricket, latest updates, saeed ajmal, muttaiha muralitharan darrel hair, umpires, cricket umpires

former test cricket match umpire darrel hair says umpires given chance to indirectly encouraging chucking : in 1995 only i told icc to not allow a single change to chuckers but icc not observed this issue seriously but after 19years they find their mistake come to correct it says darrel hair

అంపైర్ల భయమే బౌలర్లను బ్రతికిస్తోంది..

Posted: 10/13/2014 03:28 PM IST
Darrell hair says umpires timid encouraged chucking

క్రికెట్ లో ఈ మద్య విన్పిస్తున్న చకింగ్ ( విసిరవేయటం )పై మాజి అంపయిర్ డారెల్ హెయిర్ సంచలన కామెంట్లు చేశారు. ఎంపయిర్లకు అన్నీ ముందే తెలిసినా భయంతో బయటపడలేదన్నారు. కేవలం భయం వల్లనే ఇన్నాళ్ళు విసిరేసే పద్దతులు బయటపడలేదని చెప్పారు. ఛకింగ్ పై అస్ర్టేలియాకు చెందిన ఓ వార్తా పత్రికతో మాట్లాడిన మాజి టెస్ట్ క్రికెట్ అంపయిర్.., అంపయిర్లకు భయం ఉందన్నారు. అందువల్లనే బౌలర్లు చేసే ఛకింగ్, ఇతర అక్రమ మార్గాలను చూసి చూడనట్లు వదిలేసేవారు అని ఆరోపించారు.

తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ సయిద్ అజ్మల్ సస్పెన్షన్ పై మాట్లాడుతూ.., ఈ పని ఎప్పుడూ చేయాల్సి ఉందన్నారు. 1995లో ముత్తయ్య మురళీథరన్ వ్యవహారం వచ్చినపుడే ఇలాంటివి సహించవద్దని తాను ఐసీసీకి సూచించానన్నారు. అయితే వారు అప్పుడు చూసి చూడనట్లు వ్యవహరించటం వల్లే బౌలర్లు పెచ్చుమీరి ప్రవర్తించారన్నారు. ఆ సమయంలో క్రికెట్ లో ఈ వివాదంకు స్వస్తి పలికేందుకు ఆస్కారం ఉన్నా అవకాశం చేజార్చుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. చివరకు 19సంవత్సరాల తర్వాత తప్పు తెలుసుకుని చకింగ్ ను క్రికెట్ నుంచి బయటకు పంపించేశారు అని కామెంట్ చేశారు.

ఛకింగ్ సహా ఇతర విషయాలపై ఫిర్యాదులు చేసే అంపయిర్లకు బౌలర్ల తో పాటు ఐసీసీ వ్యవహార శైలి వల్ల కూడా భయం ఉండేదన్నారు. గతంలో ఛకింగ్ పై ఫిర్యాదు చేసిన ఓ అంపయిర్ కు జరిగిన పరాభవంను దృష్టిలో ఉంచుకునే.., మిగతావారు మెల్లకుండిపోయారు అని చెప్పారు. అయితే ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినన్నారు. అంపయిర్లలో ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారో వెతుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో అయినా ఐసీసీ అక్రమాలను చూసి చూడనట్లు వదిలేయకుండా మొదట్లోనే తుంచేస్తే ఉత్తమ ఆటగాళ్ళకు, అసలైన ప్రతిభ బయటకు రావటానికి ఆస్కారం ఉంటుందని హెయిర్ తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  umpires  chucking  latest updates  

Other Articles