ప్రస్తుతం టీమిండియా జట్టులో వుండే ఆటగాళ్ళందరిలోనూ కెప్టెన్ - వైస్ కెప్టెన్లుగా కొనసాగుతున్న ధోనీ - కోహ్లీలు ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. మైదానంలో భారీ స్కోరు చేయడంలోనూ, ఎక్కువ ప్రైవేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడంలోనూ, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడంలోనూ.. ఇలా అన్ని రంగాల్లోనూ ఈ ఇద్దరు ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మొత్తానికి వీరిద్దరూ ఏదో ఒక విధంగా సంచలనంగా మారుతూనే వుంటారు. ఈమధ్యే ధోనీ ప్రపంచంలో అత్యంత విలువైన క్రీడాకారుల్లో ఒకడిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కితే... ఆ విషయంలో ధోనీతో కోహ్లీ పోటీ పడుతున్నాడు. అంటే ధోనీ తరువాతి స్థానం దాదాపు ఇతనికే వుండొచ్చన్న అనుమానాలు వున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. కోహ్లీ - ధోనీలిద్దరూ ఆటగాళ్లు టీమిండియా జట్టు నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారు! కానీ బీసీసీఐ నుంచి ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారి జాబితాను బయటికి తీస్తే మాత్రం.. వీరిద్దరు చాలా వెనుకబడి వున్నారని తెలిసింది. బోర్డు నుంచి భారీ మొత్తానికి చెక్కులు అందుకుంటున్న ప్రస్తుత ఆటగాళ్లు ఎవరో కాదు.. మాజీ కెప్టెన్లయిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు. ఈ ఇద్దరు మాజీలు ప్రస్తుతం టీమిండియాలో వున్న ఆటగాళ్లందరికంటే ఏడాదికి ఏకంగా రూ.6 కో్ట్ల చొప్పున బీసీసీఐ నుంచి ఆదాయాన్ని పొందడం విశేషంగా మారిపోయింది. ఓవైపు తమ దూకుడు ప్రదర్శనతో ధోనీ - కోహ్లీలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొంది, ప్రైవేట్ కంపెనీలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నప్పటికీ... వారికి వచ్చే ఆదాయం కంటే కేవలం బీసీసీఐ తరఫున అధికారిక వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్న సన్నీ, రవిలు అధిక మొత్తాన్ని ఆర్జించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పటికే బీసీసీఐ తరఫున వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు మాజీలు.. బోర్డు అప్పగించిన కొత్త బాధ్యతలతో భారీగానే ఆదాయం పొందుతున్నారు. వ్యాఖ్యతలుగా బోర్డుతో రూ.4 కోట్ల అందుకుంటున్న వీళ్లు.. బోర్డు అప్పగించిన ఇతర వ్యవహారాలకుగానూ రూ.2 కోట్లకంటే ఎక్కువగానే ఆదాయం పొందుతున్నారని తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు.. ఐపీఎల్ ఏడో సీజన్ వ్యవహారాలు పర్యవేక్షినందుకు సన్నీ రూ.2.37 కోట్లు అందుకున్నాడు. దీంతో సన్నీ ఈ ఏడాదికి మొత్తం రూ.6.37 కోట్లు పుచ్చుకున్నట్లయింది. ఇక నిన్నటిదాకా వ్యాఖ్యతగానే వున్న రవి.. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు డైరెక్టర్ గా నియమితుడైన సంగతి తెలిసిందే! ఈ బాధ్యతల్లో కొనసాగేందుకు అంగీకరించిన రవికి ఏడాదికి రూ.2 కోట్లు జీతంగా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వ్యక్తిగత మీడియా ఒప్పందాలకు వదులుకుంటున్నందుకు పరిహారంగా.. రవి బోర్డుతో ఈ మేరకు భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఇతను కూడా ఈ ఏడాదికి రూ.6 కోట్లు అందుకోనున్నాడు.
మరి ఈ ఇద్దరి మాజీలతో పోలిస్తే.. ధోనీ, కోహ్లీలిద్దరూ చాలా తక్కువగానే ఆర్జిస్తున్నారని తేలింది. గత ఏడాదికాలంలో మొత్తం 35 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ధోనీ.. మ్యాచ్ ఫీజులు, బోర్డు కాంట్రాక్టు జీతం కలిపి కేవలం రూ.2.59 కోట్లు మాత్రమే అందుకున్నాడు. అలాగే 39 మ్యాచ్ లు ఆడిన కోహ్లీకి కూడా కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే దక్కింది. ఎంతోకష్టపడి జట్టును గెలుపుబాటలో తీసుకెళ్లేందుకు కీలక బాధ్యతలు చేపడుతున్న ధోనీ - కోహ్లీలకంటే... కేవలం వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్న మాజీలే ఎక్కువగా ఆర్జస్తున్నారన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more