Virendar sehwag to play in australia tour in third place

virendar sehwag, virendar sehwag latest news, virendar sehwag cricket career, virendar sehwag matches, virendar sehwag wiki, virendar sehwag life story, virendar sehwag news, bcci news, bcci officials, bcci officers, australia tour, india australia tour, virendar sehwag australia tour

bcci officials clarifies that virendar sehwag to play in australia tour in third place

వీరూ ఖేల్ ఖతమ్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

Posted: 10/22/2014 01:34 PM IST
Virendar sehwag to play in australia tour in third place

వీరేందర్ సెహ్వాగ్.. భారతీయ క్రికెట్ జట్టులో ఒక అనూహ్య ఆటగాడు! ఇతడు బరిలోకి దిగితే చాలు.. ప్రత్యర్థి ఆటగాళ్లందరూ ఆకాశంవైపే తమ తలను ఎత్తుకుని చూస్తూ నిలుచుండిపోయేవారు... బౌండరీలవైపుకు పరుగులు తీసేవారు. ఇతడు సింగిల్స్, డబుల్స్ కంటే ఫోర్లు, సిక్సులు బాదడమే ఎక్కువ! అవతలివైపు బౌలర్ ఎవరైనా సరే.. లెక్కచేయకుండా ఒకటే దంచుడు దంచేస్తాడు. పరాజయపాలవుతున్న భారత్ ను ఎన్నోసార్లు తన ప్రతిభతో గట్టెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే గతకొద్దికాలం నుంచి పేలవ పెర్ఫామెన్స్ ప్రదర్శించడం కారణంగా ఇతనిని జట్టులో స్థానం కల్పించడం లేదు యాజమాన్యం! ఇతని స్థానంలో అవకాశమిచ్చిన కొత్త ఆటగాళ్లు మంచి ప్రతిభను కనబర్చడంతో ఇతడిని పట్టించుకోవడం మానేసింది. వన్డే, టెస్టు మ్యాచుల్లో సెహ్వాగ్ కనిపించకపోవడం వల్ల అందరూ దాదాపుగా అతని ఖేల్ ఖతమంటూ భావించారు. ఇక సెహ్వాగ్ కెరీర్ ఇక్కడితో ముగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ సెహ్వాగ్ మళ్లీ తిరిగివస్తాడని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొంటున్నాడు. గతకొన్నాళ్లనుంచి సెహ్వాగ్ ప్రదర్శన సరిగ్గా లేకపోవడం వల్ల అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందే తప్ప.. జట్టు నుంచి పూర్తిగా తొలగించలేదంటూ తెలుపుతున్నారు.

త్వరలోనే జరగబోయే ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో సెహ్వాగ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆసీస్ టెస్టులకు మూడో ఓపెనర్ గా తీసుకునే అవకాశాలు వున్నాయని బీసీసీఐ వర్గాల సమాచారం. టెస్టుల్లో టాప్ ఆర్టర్ లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో భారత్.. సెహ్వాగ్ వైపు చూస్తోందని తెలిసింది. వీరూ ఆసీస్ తో జరగబోయే టెస్టుల్లో మూడో ఓపెనర్ స్థానం కోసం రేసులో వున్నాడని, దులీవ్ ట్రోఫీలో అతడి ప్రదర్శనను సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్ మెంట్ నిశితంగా చూస్తుందని ఓ బీసీసీ అధికారి వెల్లడించాడు.

దులీవ్ ట్రోఫీలో ఆడేందుకు ఇటీవలే సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. నిలకడగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్లను కాదని సెలక్టర్లు వీరూను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసేందుకు అతడికి ఓ అవకాశం ఇవ్వాలన్నదే వారి ఉద్దేశమని తెలుస్తోంది. సెహ్వాగ్ చివరిసారి 2013లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత అతడు ఫేలవ ఫామ్, ఫిట్ నెస్ లేకపోవడంతో టీమ్ మేనేజ్ మెంట్ అతడి స్థానంలో శిఖర్ ధావన్ ను ఎంపిక చేశారు. అప్పటినుంచి మళ్లీ జట్టులోకి రాలేదు. దీంతో అతని కెరీర్ అయిపోయిందనుకుంటున్న నేపథ్యంలో.. ‘‘సెహ్వాగ్ ఇప్పుడు ఫిట్ గా వుంటే ఆస్ట్రేలియా సిరీస్ కు టెస్టు జట్టులో స్థానం లభిస్తుంది’’ అంటూ బీసీసీఐ అధికారి స్పష్టం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virendar sehwag  india australia cricket tour  bcci officials  telugu news  

Other Articles