ఇటీవలే ఆస్ట్రేలియా యువక్రికెటర్ ఫిలిప్ హ్యూస్ దేశీయ క్రికెట్ సందర్భంగా బౌన్సర్ బంతికి బలైన విషయం తెలిసిందే! ఇలా ఈవిధంగా బౌన్సర్లు తగిలి చాలామంది గాయాలపాలవడంతోబాటు నలుగురి ప్రాణాలు పోయిన నేపథ్యంలో అలాంటి (బౌన్సర్) బంతులను నిషేధించాలన్న వాదనలు వినిపించాయి. అలాగే పిచ్’పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించి, బౌన్సర్ల వ్యవహారంలో ఆటగాళ్లకు కొన్ని సూచనలు ఇవ్వాలంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విషయమై ఐసీసీ ఆందోళనల్లో మునిగిపోయింది. అయితే ఈ వాదలన్నింటికీ వ్యతిరేకంగా.. ‘‘బౌన్సర్లు నిషేధిస్తే మజా పోతుంది’’ అంటూ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
‘‘పుల్ షాట్ ఆడబోయి బంతి తలకు తగిలి హ్యూస్ చనిపోవడం నిజంగా ఎంతో విచారకరమైంది. అయితే ఇదంతా క్రికెట్ జీవితంలో ఓ భాగం. ఏ క్రీడలో అయినా గాయాలపాలవడంతో పాటు కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా. అలా అని ప్రమాదకర బౌన్సర్లను తొలగిస్తే అది పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోతుంది. కాబట్టి బౌన్సర్లపై నిషేధం విధిస్తే గేమ్’లో వున్న అసలు మజా పోతుంది. నా కెరీర్లో కూడా చాలా బౌన్సర్లు హెల్మెట్‌కు తాకాయి’’ అని వీరూ పేర్కొంటున్నాడు. ఐసీసీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. అనంతరం హ్యూస్ మరణానికి సంతాపం తెలిపాడు.
మరోవైపు.. దాదాపు రెండేళ్లపాటు జట్టుకు దూరమైన సెహ్వాగ్, ప్రపంచకప్’కు ప్రకటించే 30మంది ప్రాబబుల్స్’లో తనకు ఖచ్చితంగా చోటుదక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘‘30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాలో నా పేరు ఉంటుందనే ఆశిస్తున్నాను. ప్రతీ క్రికెటర్‌లాగే నాకు కూడా మళ్లీ ప్రపంచకప్‌లో ఆడాలనే ఉంది. ఈసారి భారత్ కప్‌ను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆసీస్ పర్యటనలో ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా మన ఆటగాళ్లు మాత్రం బాగానే రాణిస్తారని అనుకుంటున్నాను’’ అని ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more