2015 world cup indian cricket team probabales team members

world cup indian probabales list, cricket world cup 2015, 2015 world cup cricket latest news updates, indian cricket probabales team list, vrender sehwag in probabales list, yuvraj in world cup, gautham gambhir in indian world cup team, harbhajan singh in probabales team, bcci latest updates, latest sports news telugu

2015 world cup indian cricket team probabales team members : bcci selection committee announced 2015 world cup probabales of indian cricket team. in world cup probabales list verender sehwag, yuvraj singh, zaheer khan, gautam gambhir, harbhajan singh have not selected by committee

పంచపాండవులు పనికిరారట.. ప్రాబబుల్స్ ప్రకటించిన బీసీసీఐ

Posted: 12/04/2014 03:55 PM IST
2015 world cup indian cricket team probabales team members

పాచికల ఆట పేరుతో మహభారతంలో పాండవుల్ని ప్రజలకు దూరం చేసినట్లే.., ఇప్పుడు బీసీసీఐ కూడా ఐదుగురు కీలక ఆటగాళ్లను పక్కనబెట్టింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ కోసం 30మందితో భారత ప్రాబబుల్స్ జట్టును ప్రకటించింది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ కు చోటు దక్కలేదు. వీరు లేకుండా కొందరు జూనియర్లు, సీనియర్లతో కలిపి ప్రాబబుల్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.., ఇంకొందరు షాక్ అవుతున్నారు.

గురువారం బీసీసీఐ ప్రకటించిన 30 మంది ప్రాబబుల్ష్ జట్టులో ఎంపికైన ఆటగాళ్ళు : మహేంధ్ర సింగ్ ధోని, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, రహానె, రాబిన్ ఊతప్ప, విరాట్ కొహ్లి, సురేష్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారి, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహ, సంజు సాంసన్, అశ్విన్, పర్వేజ్ రసూల్, కరన్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అషార్ పటేల్, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, వరుణ్ అరన్, ధవల్ కుల్ కర్ణి, స్టువర్ట్ బిన్ని మొహిత్ శర్మ, అశోక్ దిండా, కుల్దీప్ యాదవ్, విజయ్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

ఈ జట్టుపై మెజార్టీ వర్గాల నుంచి అసంతృప్తులు వస్తున్నాయి. ముఖ్యంగా జట్టుకోసం కష్టపడే వారిని పక్కనబెట్టడంపై క్రీడాభిమానులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు వెన్నుముకలా ఉండే డ్యాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నోసార్లు దేశాన్ని పరాజయం నుంచి లాగి విజయతీరాలకు చేర్చాడు. డ్యాషింగ్ ఓపెనర్ గా బరిలోకి దిగే గౌతం గంభీర్ కూడా జట్టు కోసం బాగా కష్టపడే స్వభావం ఉన్న ఆటగాడు. వేగంగా బంతులు విసరటంలో జహీర్ ఖాన్ ఆరితేరాడు. బౌలింగ్ మహిమకు ఎవరైనా బౌల్డ్ కావల్సిందే. స్పిన్నింగ్ మాంత్రికుడు హర్బజన్ సింగ్ ను ప్రాబబుల్స్ లో కూడా ఎంపిక చేయకుండా అవమానించారని బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ యువరాజ్ ను ఎంపిక చేయకపోవటం పట్ల ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్నో ఇంటర్నేషనల్ టోర్నీల్లో భారత్ కు విజయాలు అందించిన క్రికెటర్లను ఇలా దూరం పెట్టడాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమర్ధించుకుంటోంది. గత ఏడాది కాలంగా వీరు ఐదుగురూ ఇంటర్నేషనల్ టోర్నీలు ఆడనందువల్లే దూరంపెట్టామని అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world cup  bcci  probabales  india  sports news  

Other Articles