Mahendra singh dhoni new look hair style india cricket team captain australia test series 2015 world cup

mahendra singh dhoni, mahendra singh dhoni new look, mahendra singh dhoni new hair style, mahendra singh dhoni australia tour, mahendra singh dhoni australia tour 2014, mahendra singh dhoni new look 2014, mahendra singh dhoni hair style, mahendra singh dhoni india captain, india cricket team, world cup 2015, mahendra singh dhoni latest photo shoot, mahendra singh dhoni brand ambassador, mahendra singh dhoni twitter, international sports players

mahendra singh dhoni new look hair style india cricket team captain australia test series 2015 world cup : The team Indian cricket team cool captain has appeared with a new look hair style before going to australia tour

ప్రాక్టీస్ ఏమోగానీ.. ప్రయోగాలు మాత్రం బాగానే జేస్తుండు!

Posted: 12/06/2014 12:10 PM IST
Mahendra singh dhoni new look hair style india cricket team captain australia test series 2015 world cup

దూకుడు ప్రదర్శనతో క్రికెట్ జట్టులో ప్రత్యేకస్థానాన్ని పదిలపరుచుకున్న ఇండియా కూల్ కెప్టెన్ ధోనీ.. ప్రాక్టీస్ మ్యాచుల సందర్భంగా అంతగా కనిపించడుగానీ, అప్పుడప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాడు. మొన్నటికిమొన్న ఓ మేగజైన్ కవర్ పేజీకోసం వినూత్నరూపంలో ఫోజులిచ్చి వార్తల్లో సంచలనంగా నిలిచిన ఈ యువక్రికెటర్.. తాజాగా మరో కొత్తరూపంలో దర్శనమిచ్చాడు. దాదాపుగా గుండుతో ‘‘జార్ హెడ్’’ శైలి కటింగ్ చేసుకుని అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

ఒకప్పుడు పొడవాటి జుట్టుతో అప్పటి పాక్ అధ్యక్షుడు ముషరాఫ్’ను ఆకర్షించిన ధోనీ.. ఆ తర్వాత సీజన్’కు తగ్గట్టు, భారీటోర్నీల సందర్భంగా తన హెయిర్ స్టయిల్’ను మారుస్తూ వస్తున్నాడు. గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్’కు దూరంగా వున్న ధోనీ.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా చాలా డిఫరెంట్’గా తన లుక్’ని మార్చేశాడు. నడినెత్తిన జుట్టు వుంచుకుని.. చెవులపై భాగంతో పాటు తల వెనుక భాగంలోనూ వెంట్రుకలను బాగా ట్రిమ్‌ చేశాడు.

ఆరంభంలో పొడవాటి జుట్టుతో ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. 2007 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత జుట్టు సన్నగా కత్తిరించేశాడు. 2011 ప్రపంచకప్ సందర్భంగా పొట్టిజుట్టుతో కనిపించాడు కానీ.. కప్ గెలిచిన తర్వాత గుండుతో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు ‘‘జార్ హెడ్’’తో కనువిందు చేశాడు. 2011లో ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను స్వీకరించిన అనంతరం తన జుట్టును పెంచుకోకూడదని ధోనీ నిర్ణయించుకున్నాడు. అందుకే.. జుట్టును పెంచకుండా ఆర్మీ తరహాలోనే కొత్త లుక్కులతో వచ్చేస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles