India australia test series sidney test match border gavaskar trophy

india australia test match, india australia sidney test match, border gavaskar trophy, india australia border gavaskar trophy, virat kohli news, mahendra singh dhoni news, cricket news

india australia test series sidney test match border gavaskar trophy : finally indian finished the final sidney test match with draw in virat kohli captaincy.

సిడ్నీ టెస్టులోనూ భారత్ వైఫల్యం.. చేసేదిలేక చేతులు ముడుచుకున్నారు!

Posted: 01/10/2015 01:34 PM IST
India australia test series sidney test match border gavaskar trophy

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచులోనూ భారత్ వైఫల్యం బట్టబయలైంది. వరుసగా మొదటి రెండు మ్యాచులు ఓడిపోయిన టీమిండియా.. మూడో మ్యాచులో కూడా అదే పసలేని పర్ ఫార్మెన్స్ ను కనబరిచింది. ధోనీ తర్వాత పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ చరిష్మా కూడా ఈ మ్యాచులో అంతగా కనబడలేదు. పైగా అప్పుడే తన కెప్టెన్సీపై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కనీసం మూడో మ్యాచ్ గెలుస్తుందని ఎంతో నమ్మకంగా వున్న భారతీయ అభిమానులకు చివరికి అడియాశలే మిగిలాయి. కానీ.. ఓ వంతు వరకు ఇండియా జట్టు ఓడిపోకుండా ఈ మ్యాచ్ లో కాస్తైనా గౌరవాన్ని మిగుల్చుకుంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ మొదట్లో ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. కంగారు ఆటగాళ్లకు ఇండియా కాస్త ఎదురు సమాధానమే చెప్పింది కానీ.. చివరి వరకు తన సత్తాను చాటుకోలేకపోయింది. దాంతో  ఈ మ్యాచ్ డ్రాగానే ముగిసింది. చివరిరోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 252 పరుగులు మాత్రమే చేసి.. ఓటమి నుంచి తప్పించుకుని డ్రాగా ముగించింది. అయితే.. ఇందులోనూ భారత్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం చివరి మ్యాచైనా గెలుస్తుందనుకుంటే.. దాన్ని కూడా డ్రాగానే ముగించి, చేతులు ముడిచేసుకున్నారు.

నాలుగో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్’లో 251/6 పరుగులు చేసి 348 పరుగుల ఆధిక్యం వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 349 పరుగుల లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదట్లో దూకుడుగా ఆడినా భారత్.. ఒక్కసారిగా కీలక బ్యాట్స్ మెన్లు వెనుదిరగడంతో గెలిచే అవకాశం చేజారిపోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 80, రోహిత్ శర్మ 39, కోహ్లి 46.. ఇలా చెప్పుకోదగ్గ స్కోర్లు మాత్రమే నమోదు చేయగలిగారు. ఇక చివర్లో రహానే 38, భువనేశ్వర్ 20 పరుగులతో జాగ్రత్తగా వికెట్ కాపాడుకుంటూ.. మ్యాచ్ ను డ్రాగా ముగించడంలో కీలకపాత్రను పోషించారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 572/7 డిక్లేర్
రెండో ఇన్నింగ్స్ : 251/6 డిక్లేర్

భారత్ తొలి ఇన్నింగ్స్ : 475 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ : 252/7

నిజానికి ఒకటిన్నర రోజులో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద విషయమేమీ కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కరోజులోనే 350 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఘనతలు కూడా నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఇండియా జట్టు మాత్రం తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. దిగ్గజ బ్యాట్స్ మెన్లు మొదటగా బాగానే ప్రయత్నించారు కానీ.. తమ స్థాయికి తగ్గ ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయారు. సమయానుకూలంగా బౌలర్లను పసిగట్టి తమ ఆటను ప్రదర్శించి వుంటే.. గెలిచే అవకాశాలు ముమ్మరంగా వుండేవని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఏదైతేనేం.. కనీసం చివరి మ్యాచైనా డ్రాగా ముగించి కాస్త బెటరనిపించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles