Worldcup 2015 rules cricketers wives girlfriends not allowed tour

worldcup 2015, world cup 2015 news, indian cricketers, virat kohli affairs, anushka sharma affairs, indian cricketers affairs, virat kohli girlfriends, virat kohli anushka sharma, icc world cup 2015, bcci board news

worldcup 2015 rules cricketers wives girlfriends not allowed tour : According to the worldcup rules and regulations.. cricketers wives and lovers should not allowed in the tour.

క్రికెటర్ల గుండెలను పిండేసే వార్త..

Posted: 01/19/2015 02:00 PM IST
Worldcup 2015 rules cricketers wives girlfriends not allowed tour

ఇన్నాళ్లవరకు ఎన్నో సుఖాలను అనుభవిస్తూ తమ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన కొంతమంది క్రికెటర్లను ఇప్పుడు ప్రపంచకప్ వాటిని దాదాపు 45 రోజులవరకు దూరం చేయనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో జరిగే ఈ వరల్డ్ కప్ పోటీల్లో భారతీయ క్రికెటర్లు కొన్నాళ్లవరకు తమ కోరికలను అణిచి అదుపులో పెట్టుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా పెళ్లైన వారితోబాటు ప్రేమికులుగా చెలామణి అవుతున్న ఆటగాళ్లు! అలాఅని వీరికి రాజభోగాలు అందవని కాదు.. వీరికి కావలసిన సౌలభ్యాలన్నీ సమకూరుతాయి కానీ ఒక్క వ్యవహారంలో మాత్రం ఎడబాటు తప్పదు.

అదేమిటంటే.. ప్రపంచకప్ మెగా ఈవెంట్’కు భారత ఆటగాళ్లు తమ భార్యలకు, ప్రియురాళ్లకు దాదాపు 45 రోజుల వరకు దూరంగా వుండాల్సి వుంటుంది. ఎందుకంటే.. ప్రపంచకప్ నిబంధనల మేరకు ఈ ఈవెంట్’కు ఆటగాళ్ల భార్యలను, ప్రియురాళ్లను అనుమతించడం ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదు. అలాకాకుండా వీరికి అనుమతిస్తే.. తమ దృష్టిని ఆటమీద కాకుండా కుటుంబసభ్యులపై ఎక్కువగా సారిస్తారని.. తద్వారా తమ ప్రతిభను కోల్పోయి జట్టు వైఫల్యానికి కారకులవుతారని వారి భావన! అందుకే.. ఎప్పటినుంచో కుటుంబసభ్యులను అనుమతించకూడదనే నిబంధన ఇప్పటివరకు కొనసాగుతూనే వస్తోంది.

కాగా.. సరిగ్గా ప్రేమికుల దినోత్సవంరోజే వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. భారతీయ క్రికెటర్లు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్’మన్ విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్కశర్మకు దూరంగా గడపాల్సి వస్తోంది కాబట్టి.. అతను కాస్త అప్సెట్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఇతనిలాగే మిగతా ఆటగాళ్లు కూడా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు బీసీసీఐ ఈ నిబంధన గురించి ఎటువంటి విషయాన్ని అదికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఓ బీసీసీఐ అధికారి అయితే దీనిపై స్పందిస్తూ.. ఈ పర్యటనలో క్రికెటర్ల వెంట భార్యలు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్నప్పటికీ.. వరల్డ్ కప్’లో ఇంతకుముందు ఎలా జరిగిందో దానికే కట్టుబడి వుంటామని స్పష్టం చేశారు. దీంతో స్పష్టమయ్యే విషయమేంటంటే.. క్రికెటర్లు తమ భార్య, ప్రియురాళ్లతో దూరంగా వుండాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world cup 2015  indian cricketers affairs  virat kohli anushka sharma  

Other Articles