International cricket council cuts 50 percent fee of warner

rohith sharma latest news, dawid warner latest news, rohit sharma dawid warner clashes, icc cuts warner fee, rohit warner clashes, india australia oneday series, rohit sharma new records, indian cricketers

international cricket council cuts 50 percent fee of warner : Icc cuts 50 percent fee of australia cricketer dawid warner for clashes with rohit sharma without any reason.

రోహిత్’తో గొడవపడ్డ వార్నర్’కు భారీ మూల్యం

Posted: 01/19/2015 04:16 PM IST
International cricket council cuts 50 percent fee of warner

ముక్కోణపు సిరీస్’లో భాగంగా మెల్బోర్న్’లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా రెండు వన్డేలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే! ఆ గొడవ సారాంశమేమిటంటే... వార్నర్ విసిరిన ఓవర్ త్రోకు రోహిత్ ఓ పరుగు తీశాడు. దీనిపై విరుచుకుపడ్డ వార్నర్.. రోహిత్’తో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా రోహిత్ తన జాతీయ భాషలో వార్నర్’పై తిట్లపురాణం కొనసాగించగా.. ఆంగ్లంలో మాట్లాడమంటూ అతగాడు రోహిత్’ను సూచించాడు. అలా వీరిమధ్య ఆ గొడవ కాస్త వాడీవేడీగా జరుగుతున్న సమయంలో అంపైర్ల రంగప్రవేశంతో శాంతించింది.

అయితే ఈ వ్యవహారంలో వార్నరే దురుసుగా ప్రవర్తించాడు. అనవసరంగా రోహిత్’ను గెలకడమే కాకుండా అతనిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఏదైతేనేం.. ఈ వ్యవహారం చివరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి దృష్టికి చేరింది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ.. ఇందులో ఎవరిది తప్పుందో తేల్చి వారికి భారీ మూల్యం విధించింది. ఆ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగిన ఆ గొడవలో ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్’దే తప్పు వుందని ఐసీసీ తన విచారణలో తేల్చింది. అనంతరం ఇందుకు అతడిపై మూల్యం విధిస్తూ.. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత వేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma dawid warner clashes  icc latest news  icc world cup 2015  

Other Articles