Australia match referee fines captain george bailey

george bailey news, australia captain george bailey, australia player smith, austrlia referee, australia cricket team

australia match referee fines captain george bailey for slow over rate

జట్టు స్లోగా ఆడినందుకు కెప్టెన్’పై వేటు

Posted: 01/19/2015 05:33 PM IST
Australia match referee fines captain george bailey

అనుకున్న సమయంకంటే జట్టు చాలా స్లోగా ప్రదర్శించిన కారణంగా ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ కెప్టెన్’పై భారీగానే వేటు పడింది. ఆదివారం భారత్’తో జరిగిన వన్డే మ్యాచ్’లో నిర్ణీత సమయానికి ఆస్ట్రేలియా ఒక ఓవర్ తక్కువగానే వేసింది. దీంతో ఈ దెబ్బ కెప్టెన్ జార్జి బెయిలీపై పడింది. ఎందుకంటే.. కెప్టెన్ హోదాలో వుండి జట్టు ప్రదర్శనను అదుపులో వుంచుకోవాల్సిన వ్యక్తే దానిని నిర్లక్ష్యంగా తీసుకుంటే.. ఈ విధమైన జరిమానాలే వుంటాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ జార్జి బెయిలీపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అంతేకాదు.. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత కూడా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇతగాడు హొబర్ట్’లో ఇంగ్లాండ్’తో జరిగే తర్వాత మ్యాచ్’లో ఆడలేడు. ఇక ఫీజులోనూ కోత విధించడంలో అతగాడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సహచరులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇతడు నిషేధించబడిన మ్యాచ్’కి స్మిత్ సారధ్యం వహించే అవకాశాలు వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : george bailey news  australia cricketers  

Other Articles