Pakistan spinner saeed ajmal controversial comments on his cricket team

saeed ajmal news, saeed ajmal controversial comments, pakistan cricketer comments, world cup 2015, icc world cup 2015, saeed ajmal pakistan team, pakistan worldcup 2015, saeed ajmal comments

pakistan spinner saeed ajmal controversial comments on his cricket team : pak bowler saeed ajmal said that.. their pakistan team will not reach atleast semi final in the worldcup.

‘అంత సీన్ లేదు’.. సొంతజట్టుపై పాక్ క్రికెటర్ విమర్శలు

Posted: 01/20/2015 12:09 PM IST
Pakistan spinner saeed ajmal controversial comments on his cricket team

‘ప్రపంచకప్ కాదు కదా.. కనీసం సెమీస్’కు చేరు సీన్ తమ పాకిస్తాన్ జట్టుకు లేదు’ అంటూ పాక్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన దేశ ప్రతిష్ట దిగజారిపోయేలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు మొదట్లోనే వెనుదిరిగి వచ్చేస్తుందని.. ఇతర దేశ ఆటగాళ్లతో పోరాడే సత్తా పాక్ జట్టుకు లేదని తెలిపాడు. ప్రస్తుతం సందేహాత్మక బౌలింగ్’తో ఐసీసీ సస్పెన్షన్’లో వున్న ఈ ఆటగాడు.. గతకొన్నాళ్ల నుంచి దూరంగా వున్న విషయం తెలిసిందే! అయితే తాజాగా ఈ విధంగా కామెంట్లు చేయడాన్ని తోటి ఆటగాళ్లతోబాటు పాక్ దేశస్తులు ఆశ్చర్యం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై అజ్మల్ సవివరంగా వెల్లడిస్తూ.. ‘‘పాక్ జట్టు బౌలింగ్ ఏమాత్రం బాగాలేదు. ఒకవేళ హఫీజ్’కు కూడా బౌలింగ్ అనుమతి లభించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుంది. ఇక బ్యాట్స్ మెన్ల విషయాన్ని వస్తే.. అందరూ అద్భుతంగా రాణిస్తే తప్ప విజయావకాశాలు వుండవు. ఏ ఒక్క ఆటగాడు సరిగ్గా ఆడకపోయినా ఓటమి తథ్యం. ప్రస్తుతం ఇతర జట్ల ఆటతీరును బాగా పరిశీలిస్తే.. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే సెమీస్ బరిలో వుండే అవకాశాలున్నాయి’’ అంటూ తెలిపాడు.

అజ్మల్ ఈవిధంగా తన దేశజట్టుపైనే సంచలన వ్యాఖ్యలు చేయడంపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్’లో వున్న ఈ ఆటగాడు తనకు స్థానం లభించకపోవడం వల్ల ఈ విధంగా వ్యాఖ్యానాలు చేసి వుంటాడని అభిప్రాయపడుతున్నారు. ఇక పాక్ దేశీయులు ఒక్కొక్క విధంగా ఇతనికి జవాబుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దేశప్రతిష్ట దిగజారిపోయేలా వ్యాఖ్యలు చేసిన ఇతగాడికి బుద్ధి చెప్పాలంటూ విరుచుకుపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pak bowler saeed ajmal news  icc worldcup 2015  india cricket team  

Other Articles