rajasthan royals won hattrick match against mumbai indians | ipl 8

Rajasthan royals won against mumbai indians ipl 8 ahmedabad stadium

rajasthan royals, mumbai indians, rajasthan royals hattrick won, mumbai indian hattrick loss, ipl 8 season, ipl 8 teams, rohit sharma, kieron pollard, anderson, steven smith, indian cricketers

rajasthan royals won against mumbai indians ipl 8 ahmedabad stadium : The rajasthan royals team massively won the match against mumbai indians and make hattrick. This match held in ahmedabad stadium.

ఒకేసారి హ్యాట్రిక్ కొట్టిన ముంబై, రాజస్థాన్ ఐపీఎల్ జట్లు

Posted: 04/15/2015 10:48 AM IST
Rajasthan royals won against mumbai indians ipl 8 ahmedabad stadium

ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఈ రెండు జట్లలో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం కోసం బరిలోకి దిగగా.. ఇప్పటికే రెండు పరాజయాలతో సతమతమవుతున్న ముంబై జట్టు మూడో మ్యాచులోనైనా బోణీ కొట్టాలని ఆకాంక్షించింది. కానీ.. ముంబై జట్లు మూడోసారి ఓటమిపాలై హ్యాట్రిక్ నమోదు చేయగా.. అటు రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కెరటాన్ని ఎగురవేసింది.

వివరాల్లోకి వెళ్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. మొదట రెండుమూడు ఓవర్లు ఓపెనర్లు భారీ షాట్లతో అభిమానులను ఉత్సాహపరిచారు కానీ.. వెనువెంటనే టపిటపీమని వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ (5 బంతుల్లో 0 పరుగులు) డకౌట్ అవడంతో జట్లు నష్టాల్లో మునిగింది. దీంతో ముంబై జట్లు 10 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి కేవలం 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పుడు క్రీజులో వున్న డ్యాషింగ్ క్రికెటర్ కైరన్ పొలార్డ్ (34 బంతుల్లో 70 పరుగులు) , కోరీ అండర్సన్ (38 బంతుల్లో 50 పరుగులు) భీకరమైన షాట్లతో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు రాణించడంతో ముంబై జట్లు 20 ఓవర్లలో 164 పరుగులు చేయగలిగింది.

ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్లు ఆటగాళ్లు.. మొదటి నుంచే పటిష్టంగా ఆడుతూ వచ్చారు. వెనువెంటనే వికెట్ కోల్పోకుండా, అధిక బంతులు వేస్ట్ చేయకుండా బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఓపెనర్ అజింక్యా రహానే 46 పరుగులతో శుభారంభాన్నిచ్చాడు. అయితే.. ఒకానొక దశలో రాజస్థాన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. లక్ష్యాన్ని చేధించేందుకు రాజస్థాన్ జట్టుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి వుండేది. అప్పుడు ఆ జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అధ్బుతంగా రాణించాడు. చివరిదాకా క్రీజులోనే వున్న ఈ కంగారు బ్యాట్స్ మెన్ చెలరేగి (79 పరుగులు).. విశ్వరూపం ప్రదర్శించాడు. ఇతని ప్రదర్శన ముందు ముంబై ఓటమి ఒప్పుకోక తప్పలేదు. దీంతో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం సాధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasthan royals  mumbai indians  ipl 8  rohit sharma  

Other Articles