Saniamirza | World | Rankings

Sania mirza got appriciations from all over india and pakistan

Sania mirza, world no1, batminton, world, sania, hyderabad

sania mirza got appriciations from all over india and pakistan. Sania mirza got world no one rank in doubles by WBA rankings.

సానియా మీర్జాకు ప్రశంసల వెల్లువ

Posted: 04/15/2015 03:54 PM IST
Sania mirza got appriciations from all over india and pakistan

టెన్నిస్ లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన సానియా మీర్జా హైదరబాద్ కు చేరుకున్నారు. అభిమానుల సందడి మధ్య ఘన స్వాగతాన్ని అందుకున్నారు సానియా. ఓ సాధారణ అమ్మాయి ప్రపంచంలో తొలిస్థానానికి చేరుకోగలదని తాను నిరూపించానని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేర్కొంది. తన విజయం ఎంతోమంది ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకం అని చెప్పింది. ఆడపిల్లలను కలిగి ఉండటం ఓ బలహీనతగా తల్లిదండ్రులే చూడటం ఈ దేశంలో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందడంపై సానియా ఉబ్బితబ్బిబయిపోతోంది.

తెలంగాణ ప్రభుత్వం సహకారం మరువలేనిది అని కూడా సానియా మీర్జా తెలిపింది. అయితే  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పందించాడు. తన భార్య సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు.. ఆమె విజయం భారత్ తోపాటు పాకిస్థాన్ కు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. ‘సానియా విజయం పట్ల నేను చాలా గర్వంగానూ, సంతోషంగానూ వున్నాను. నా భార్యగా పాకిస్థాన్ కు చాలా గర్వకారణం. అంతేకాదు.. 100 శాతం నిబద్ధతతో తన దేశం తరఫున సానియా ప్రాతినిధ్యం వహిస్తోంది’ అని షోయబ్ అన్నాడు. అలాగే ఆమె విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని, అది సానియా నిరూపించిందని అతడు పేర్కొన్నాడు. సానియా గెలుపొందిన తర్వాత కుటుంబసభ్యులతో కలిసి సియోల్ కోటలో వేడుక జరుపుకున్నామని షోయబ్ వెల్లడించాడు. మొత్తానికి అలా అందరితో పాటు తన భర్త దగ్గరి నుండి కూడా సానియా మీర్జా ప్రశంసలు అందుకుంది. ఇక అభిమానులు, బాలీవుడ్, టాలీవుడ్ సార్లు, రాజకీయ నాయకుల పేర్లయితే చెప్పనక్కర్లేదు. అందరూ సానియా సూపర్ అంటూ కితాబిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania mirza  world no1  batminton  world  sania  hyderabad  

Other Articles