Delhi | Punjab | IPL | YUvaraj

Delhi vs punjab match will start on 8pm today in pune

punjab, delhi, daredevils, punjab kings, yuvaraj, pune, IPL, dumini, sehwag

delhi vs punjab match will start on 8pm today in pune. The delhi daredevils trying to defeat punjab eleven team. Yuvaraj sigh need to preform better in this match.

కింగ్స్ Vs డేర్ డెవిల్స్ మ్యాచ్ నేడే

Posted: 04/15/2015 04:03 PM IST
Delhi vs punjab match will start on 8pm today in pune

ఐపీఎల్ లో వరుసగా 11 పోటీలనుంచి పరాజయం పాలవుతున్న ఢిల్లీకి ఇది డూ ఆర్ డై అన్నపోటీ. ఇప్పటివరకూ ఏ జట్టు ఐపీఎల్ లో వరుసగా 12 సార్లు ఓడిపోలేదు. ఈ చెత్తరికార్డును ఢిల్లీ డేర్ డెవిల్స్ మెరుగు పరచుకోవల్సి ఉంది. ఐపీఎల్- 2015 క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తలపడనుంది. పుణే వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 8గంటలకు ప్రారంభంకానుంది.ఈ మ్యాచ్ లోనైనా బోణి కొట్టాలని డేర్ డెవిల్స్ భావిస్తోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ టీమ్ ఖాతా తెరవలేదు. ఓటమితో టోర్ని ప్రారంభించిన పంబాబ్ తర్వాత పుంజుకుంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో 26 పరుగులతో ఓడిన పంజాబ్ తర్వాతి మ్యాచ్ లో ముంబై జట్టుపై 18 పరుగులతో విజయం సాధించింది.

అయితే ఐపిఎల్-8 సీజన్ లో 16 కోట్లకు అమ్ముడు పోయి రికార్డు స్వంతం చేసుకున్న యువరాజ్ ఐపిఎల్ లో మాత్రం ఇప్పటి వరకు మెరుపులు మెరిపించలేదు.  బహుషా యువరాజ్ సింగ్ ఇప్పటివరకు తన ఆట తీరును ప్రధర్శించనందుకే ఢిల్లీకి విజయం దక్కడం లేదు అని కూడా కొందరు అనుకుంటున్నారు. అయితే ధోనీ వల్లే యువరాజ్ కు అవకాశాలు దక్కడం లేదని యువరాజ్ తండ్రి ఆరోపించడం.. తర్వాత దాన్ని యువీ తప్పుపట్టడం జరిగింది. అయితే యువీ తన కాంసట్రేషన్ గేమ్ పై పెట్టాలని కూడా కొందరు సలహా ఇస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏ మ్యాచ్ లోనూ యువీ తన స్టైల్ ను చూపించలేదు. ఎంతో ఆశలతొ దిగుతున్నా మ్యాచ్ లో మాత్రం చివరకు ఓటమితో వెనుదిరుతున్నారు ఢిల్లీ ఆటగాళ్లు. అయితే ఇప్పటివరకు 14 సార్లు తలపడగా 9 పర్యాయాలు పంజాబ్ గెలిచింది. ఈరోజు మ్యాచ్ లో గెలుపెవరిదో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఈ రాత్రికి మ్యాచ్ లో తెలిసిపోతుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు...
జార్జి బెయిలీ ( కెప్టెన్) వీరేంద్ర సెహవాగ్, మురళీ విజయ్, అనురీత్ సింగ్, పి. ఆవానా, ఆర్. ధావన్, వైఎ గోల్ వాల్కర్, గురుకీరత్ సింగ్, బిఇ హెండ్రిక్స్, ఎంజీ జాన్సన్, కరణ్ వీర్ సింగ్, ఎస్ ఇ మార్ష్, జిజె మాక్స్ వెల్, డి మిల్లర్, ఎన్ ఎస్ నాయక్, ఏ ఆర్ పటేల్, ఎన్ ఎల్ టీసీ పెరిరా, వర్థమాన్ సాహా, సందీప్ శర్మ, శివం శర్మ, ఎస్ ఎన్ ఠాకూర్, ఎం. వోహ్రా

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు...
జెపి డుమిని ( కెప్టెన్) యువరాజ్, మనోజ్ తివారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్, డికాక్, కోల్టర్ నెయిల్, గౌతం, టిఎం హెడ్, ఇమ్రాన్ తాహిల్, ఎస్ అయ్యర్, కెఎం జాధవ్, కెకె జియాస్, జహీర్ ఖాన్, ఎడి మాథ్యూస్, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ, జెఎ మార్కెల్, డిముత్తుస్వామి, ఎస్ నదీం, జిఎస్ సంధు, ఎంపి స్టోనిస్, ఎస్ ఎస్ తివారి, జెడి ఉనద్ కట్, జె. యాదవ్

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab  delhi  daredevils  punjab kings  yuvaraj  pune  IPL  dumini  sehwag  

Other Articles