BCCI secretary Anurag Thakur spotted socialising with alleged bookie

Bcci secretary anurag thakur spotted with alleged bookie

Anurag Thakur, Anurag Thakur cricket bookie, bookie karan gilhotra, karan gilhotra anurag thakur, icc, indian cricket board, ipl controversy, ipl bookies, board secretary anurag thakur, suspected bookies

BCCI secretary Anurag Thakur spotted with alleged bookie : The International Cricket Council (ICC) has written a letter to the Indian cricket board, drawing its attention to board secretary Anurag Thakur socializing with a suspected bookie recently.

వలవేసే క్రికెట్ బుకీతో.. బీసీసీఐ కార్యదర్శి చిందులు!

Posted: 04/27/2015 11:52 AM IST
Bcci secretary anurag thakur spotted with alleged bookie

క్రికెట్ రంగంలో ‘బుకీ’ల పాత్ర ఎలా వుంటుందో ‘ఐపీఎల్’ వర్ణించింది. మందు, అమ్మాయిలు, డబ్బులు.. ఇలా రకరకాలు పద్ధతుల్లో ఆటగాళ్లకు వలవేసి.. ఆటలో చక్రం తిప్పడం వీరి పని అంటూ ‘ఐపీఎల్’ తేల్చేసింది. దీంతో ఇటువంటివారిని నియంత్రిస్తామంటూ బీసీసీఐ గురుతర బాధ్యతను స్వీకరించి.. తామెంటో నిరూపించుకుంటామని మొన్నటికి మొన్నే పెద్దపెద్ద డైలాగులే తేల్చి చెప్పింది. ఇటువంటి సందర్భంలో ఈ మండలి ఓ సరికొత్త వివాదంలో చిక్కుకుంది.

బీసీసీఐలో అధ్యక్షుడి తర్వాత మరో అత్యున్నత స్థానమైన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్న బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. ఐసీసీ నిషేదిత జాబితాలో వున్న క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ప్రసారం చేసింది. ఈ సమాచారాన్ని అందుకున్న ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొన్నిరోజుల తర్వాత బుకీ కరణ్ తో అనురాగ్ పార్టీలో పాల్గొన్నాడని, అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు ఐసీసీ ఈనెల 22వ తేదీన పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. అయితే.. ఈ విషయంపై దాల్మియా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఠాకూర్ పై చర్యలకు దాల్మియా అంతగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.

పూర్తి వివారల్లోకి వెళ్తే.. మార్చి 2వ తేదీన బోర్డు ఎన్నికలు జరగగా.. కొన్ని రోజుల తర్వాత చండీగఢ్ లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనురాగ్ కేక్ కట్ చేయడం.. బుకీ గిల్హోత్రా ఆయన ఒకరినొకరు కేక్ లు తినిపించుకోవడం వంటివి ఫోటోలు బయటికొచ్చాయి. అయితే.. గతఐపీఎల్ సందర్భంగా గిల్హోత్రా ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో స్నేహం చేసేందుకు ప్రయత్నించినట్లు ఏ.సీ.ఎస్.యూకు అందాయని ఐసీసీ తన మెయిల్ లో ప్రస్తావించింది.

అలాగే.. తమ ఆటగాళ్లు గిల్హోత్రాకు దూరంగా వుండాలే చూడాలని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ని గతేడాది అన్ని జట్ల ఫ్రాంచైజీలకు రాతపూర్వకంగా తెలిపినట్లు పేర్కొంది. నాలుగురోజుల క్రితమే ఐసీసీ నుంచి మెయిల్ అందినా.. బీసీసీఐ దీన్ని నిర్ధారించకపోవడంగానీ, స్పందించకపోవడంగానీ విశేషం! బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోరాడుతున్న సమయంలోనే ఇలా కొత్త చిక్కు రావడం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. దీనిపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే!

AS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Thakur  bookie karan gilhotra  suspected Bookies  

Other Articles