Srinivasan allegedly hired London firm to spy on BCCI officials | Report

Srinivasan allegedly hired london firm to spy on bcci officials

Srinivasan news, Srinivasan spy on board, Srinivasan chennai news, Srinivasan controversies, Srinivasan gallery, Srinivasan board members, csk franchise, bcci news

Srinivasan allegedly hired London firm to spy on BCCI officials : Apart from the issue of undervaluing the Chennai Super Kings (CSK) franchise, another issue that can land former BCCI chief in trouble is the issue of alleged spying on board members.

బోర్డు సభ్యులపై శ్రీ‘నిఘా’ గూఢచర్యం..!

Posted: 04/27/2015 12:46 PM IST
Srinivasan allegedly hired london firm to spy on bcci officials

ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమవుతున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ ఛైర్మన్ ఎన్. శ్రీనివాసన్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇన్నాళ్లూ క్రికెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్న ఈయన.. తన బోర్డు సభ్యులపై గూఢచర్యం చేశారని తాజాగా మరో బాగోతం బయటపడింది. సభ్యుల ఫోన్లు ట్యాప్‌ చేయడంతో పాటు వారి ప్రైవేటు ఈ మెయిల్స్‌ను శ్రీనివాసన్ ట్రాక్‌ చేయించారని తెలుస్తోంది. ఇలా సభ్యుల కదలికపై నిఘా పెట్టేందుకు ఆయన బోర్డు ఖజానా నుంచి లండన్‌కు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి రూ. 14 కోట్లు ముట్టజెప్పినట్టు కథనాలు కూడా వచ్చాయి.

దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. శ్రీనివాసన్ తన సహచర సభ్యులపై ఎందుకు నిఘా పెట్టారు? ఇటువంటి పనులకు బోర్డు సొమ్మును వాడుకునేందుకు ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారు? విషయాలపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ విక్రయం మొత్తాన్ని తక్కువగా చూపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలోనే శ్రీనివాసన్ ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ చెన్నై జట్టును తన అనుబంధ సంస్థకు రూ. ఐదు లక్షలకే విక్రయించినట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ విషయంపై ఐపీఎల్‌ నూతన పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌.. తమిళనాడు క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడు పీఎస్‌ రామన్‌తో చర్చించనట్టు సమాచారం. రూ. 1500 కోట్లు విలువ చేసే జట్టు విక్రయ విలువను కేవలం ఐదు లక్షలుగా మదింపు చేయడం వెనకున్న కారణం ఏమిటో రామన్‌ను మనోహర్‌ అడిగారని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivasan Controversies  BCCI officials  Board members News  

Other Articles