టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఎంతటి అద్భుత క్రికెటరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతని సారథ్యంలో భారత్ ఎన్నో విజయాలను, రికార్డులను నమోదు చేసుకుంది. అటువంటి ప్లేయర్ ప్రస్తుత ఇండియా జట్టుకు కోచ్ గాగానీ, డైరెక్టర్ గాగానీ నియమితుడైతే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఎంతోమంది ప్రముఖులు అభిప్రాయాలు వెల్లడించారు. దాదాపు దాదాయే రవిశాస్త్రి స్థానంలో డైరెక్టర్ గా ఖరారు అవుతారేమోనని అంతా భావించారు. కానీ.. ఇంతలోనే ఓ బీసీసీఐ కార్యదర్శి ఆ వార్తలపై నీళ్లు చల్లేశాడు. గంగూలీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బాంబు పేల్చేశాడు.
గతకొన్నాళ్ల నుంచి గంగూలీని టీమిండియా డైరెక్టర్ గా గానీ, సలహా సంఘం ఛైర్మన్ గా గానీ, హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ గా గానీ, చీఫ్ కోచ్ గా గానీ తీసుకునే అవకాశాలున్నాయన్న వార్తలు విస్తృతంగా వస్తున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే తాజాగా దీనిపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన కోల్ కతాలో మాట్లాడుతూ.. గంగూలీ విషయమై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని.. గంగూలీ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
‘గంగూలీ గొప్ప క్రికెటర్.. భారత క్రికెట్ కు అతను అందించిన సేవలు అమోఘం. అయితే.. అతని విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొద్ది సమయం పడుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటాం’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. తాను బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసేందుకు కోల్ కతా వచ్చానని పేర్కొన్న ఆయన.. బంగ్లాదేశ్ టూర్ కు ఇప్పటికే జట్టును ప్రకటించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కోచ్, సహాయక సిబ్బందిని ప్రకటిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more