భారత యువసంచలనం రోహిత్ శర్మ.. ఐపీఎల్-8 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే! తొలుత వరుస పరాజయాలు ముంబై చవిచూసిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అద్భుతంగా రాణించగల ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఒక దశలో ముంబై జట్టు కనీసం ప్లేఆఫ్ కు కూడా చేరుతుందో..? లేదో..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. అంతలోనే దశ తిరిగింది. ముంబై వరుస విజయాలు నమోదు చేసుకుంటూ.. చివరకు ట్రోఫీనే సొంతం చేసుకుంది.
ఓటమి అంచులదాకా వెళ్లి అనూహ్య విజయం నమోదు చేసుకుంది. ఈ విధంగా జట్టు పుంజుకోవడానికి కారణం రోహిత్ శర్మయేనని అతని మీద ప్రశంసల వర్షం కురిసింది. మొదట ఆ జట్టు ఓటమికి కారకుడు రోహిత్ శర్మ అని ఎవరైతే పేర్కొన్నారో.. వారే అతనిని పొగడ్తలతో ముంచెత్తేశారు. అటు ముంబై అభిమానులు సైతం రోహిత్ ని ఆకాశానికెత్తేశారు. ‘రోహితా.. మజాకా..’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టేశారు. ఇక క్రికెట్ ప్రముఖులు సైతం రోహిత్ మీద ప్రశంసల జల్లులు కురిపించేశారు. ఇప్పుడు తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా రోహిత్ శర్మ మీద ప్రశంసలు కురిపిస్తూ ఢంకా బజాయించేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న సచిన్.. రోహిత్ మంచి కెప్టెన్ గా ఎదుగుతాడని అతని మీద ప్రశంసల వర్షం బాగానే కురిపించేశాడు. ఈ క్రమంలోనే సచిన్ మాట్లాడుతూ.. ‘రోహిత్ చాలా ఆత్మవిశ్వాసంతో వున్నాడు. అతడు భవిష్యత్తులో మంచి కెప్టెన్ గా ఎదుగుతాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అతను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. వాటన్నింటికీ ఎదురొద్ది ముంబైని విజేతగా నిలిపాడు. అతడికి మంచి భవిష్యత్తు వుంది’ అని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more