Andre Fletcher arrested for possessing ammunition

Wi cricketer andre fletcher arrested for carrying ammunition

WI cricketer Andre Fletcher arrested for carrying ammunition, Cricket West Indian Cricketer Andre Fletcher Arrested for Carrying Ammunition, wisden india, cricket, west indies, andre fletcher, windward islands, Andre Fletcher, arrest, carrying ammunition, latest Cricket news

Andre Fletcher, 27, was practising with the Windward Islands team and was about to leave the country, when he was arrested.

మందుగుండు అక్రమరవాణాలో అండ్రీ ఫ్లెచర్ అరెస్ట్

Posted: 05/29/2015 10:33 PM IST
Wi cricketer andre fletcher arrested for carrying ammunition

వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ (27) తనను తాను వివాదాల్లోకి లాగుకున్నాడు. అక్రమ ఆయుధాల కేసులో ఫ్లెచర్ తనకు తాను కష్టాలు కోని తెచ్చుకున్నాడు. శుక్రవారం రోజున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతను అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ లో అతడిని నిలిపిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 50 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విండ్ వార్డ్ ఐస్ లాండ్ టీంలో ఫ్లెచర్ సభ్యుడిగా  కొనసాగుతున్నాడు.
 
ఫ్లెచర్ అరెస్టును అతని జట్టు మేనేజర్ దృవీకరించారు. అతడికి పూర్తి మద్దుతనిస్తామని చెప్పారు. అతడికి మద్దుతునిస్తాం.. జట్టు నుంచి తొలగించం.. అది టీమ్ మేనేజర్ గా నా బాధ్యత అని ఓ వైబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కోన్నారు. 2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చిన ఫ్లెచర్ 15 వన్డేలు, 22 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడాడు. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 అతను చివరిసారి కనిపించాడు. ఆ మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఫ్లెచర్ చేశాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andre Fletcher  arrest  carrying ammunition  

Other Articles