ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఐపిఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించిన మాజీ సిజెఐ జస్టిస్ లోథా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సంచలన తీర్పునిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఈ కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బిసిసిఐ మాజీ అద్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మొయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహభాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం పెట్టింది.
కేవలం ఐపిఎల్ మాత్రమే కాకుండా ఎలాంటి క్రికెట్ టోర్నమెంటులలోనూ వీరి భాగస్వాములకు కాకుండా వారిపై జీవితకాల నిషేధానికి కమిటీ ఆదేశించింది. ఐపీఎల్ ప్రతిష్టను మేయప్పన్, కుంద్రా దిగజార్చారని లోథా కమిటీ వ్యాఖ్యానించింది. ఐపిఎల్ ఫిక్సింగ్ బారిన పడడం అప్పట్లో సంచలనం రేపింది. బీసీసీఐ మాజీ బాస్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొని తన పదవికి ముప్పు తెచ్చుకున్నారు. అప్పట్లో శ్రీనివాసన్ ఈ పరిణామంపై స్పందిస్తూ తాము నిర్దోషులమని, తాను, తన అల్లుడు ఏ పాపం ఎరుగమని కోర్టును వేడుకున్నా.. న్యాయస్థానం ఈ క్రమంలో జస్టిస్ లోధా కమిటీని ఏర్పాటు చేసి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. అత్యున్నత న్యాయస్థానం నియమించిన కమిటీ తీర్పును వెలువరించిని నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్న శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more