Mahanama to step down from ICC match referee panel

Mahanama to step down from icc match referee s position

Roshan Mahanama, former Sri Lanka batsman, ICC elite match referees panel, Dubai, International Cricket Council (ICC), Mahanama business activities, Sri Lanka

Roshan Mahanama, the former Sri Lanka batsman, will step down from the ICC elite match referees panel at the end of the year so that he can spend more time with his family and focus on his business activities in Sri Lanka.

అంపైరింగ్ కు మహనామా వీడ్కోలు

Posted: 09/16/2015 11:05 PM IST
Mahanama to step down from icc match referee s position

అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘమైన సేవలందించిన రోషన్ మహనామా తన అంపైరింగ్ జీవితానికి త్వరలో వీడ్కోలు చెప్పనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ రిఫరీస్ ఎలైట్ ప్యానెల్ లో కొనసాగుతున్న మహనామా అంపైరింగ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. మహనామా కాంట్రాక్టు మరో ఆరు నెలలు ఉన్నా.. కుటుంబంతో అత్యంత సమయం గడపాలనే కారణం చేత ప్యానెల్ నుంచి బయటకొస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో మహనామా అంపైరింగ్ సేవల నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

శ్రీలంక క్రికెట్ లో విశేష సేవలందించిన మహనామా.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో 2004 సభ్యత్వం స్వీకరించారు.  అటు తరువాత 222 వన్డేలు, 58 టెస్టులు, 35 ట్వంటీ 20 మ్యాచ్ లకు మహనామా అంపైర్ గా, రిఫరీగా పనిచేశారు . ఇందులో మూడు వరల్డ్ కప్ లతో పాటు, 2009లో జరిగిన ఐసీసీ చాంపియ్స్ ట్రోఫీ కూడా ఉండటం విశేషం. దాదాపు 12 సంవత్సరాల పాటు మహనామా ఐసీసీ ప్యానెల్లో కొనసాగారు. అటు ఆటగాడిగా, అంపైర్ గా, రిఫరీగా సుమారు 600 మ్యాచ్ లు అనుభవం మహనామా సొంతం.  శ్రీలంక క్రికెట్ జట్టు తరుపున 1986 నుంచి 1999 వరకూ సేవలందించిన మహనామా 52 టెస్టులు, 213 వన్డేలు ఆడారు. 1996 లో శ్రీలంక సాధించిన వరల్డ్ కప్ లో మహనామా సభ్యుడు కావడం మరో విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roshan Mahanama  former Sri Lanka batsman  ICC elite match referees panel  Dubai  

Other Articles