wankhade stadium curator sudhir naik wrote letter to bcci to take action on ravi shastri | ravi shastri controversies

Sudhir naik wrote letter to bcci to take action on ravi shastri

sudhir naik, ravi shastri, wankhade stadium, pitch controversy, ravi shastri abused sudhir naik, bcci letter, sudhir naik letter to bcci, sudhir naik letter controversy, ravi shastri

sudhir naik wrote letter to bcci to take action on ravi shastri : wankhade stadium curator sudhir naik wrote letter to bcci to take action on ravi shastri.

‘రవిశాస్త్రిపై చర్యలు తీసుకోండి’.. బీసీసీఐకి అందిన లేఖ!

Posted: 10/30/2015 06:42 PM IST
Sudhir naik wrote letter to bcci to take action on ravi shastri

టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి వివాదాలకు కేంద్రబిందువుగా మారినట్లు కనిపిస్తోంది. నిన్నటిదాకా కాస్త సైలెంట్ గానే వుంటూ వచ్చిన ఆయన.. ఈమధ్యకాలంలో తన మాటల దూకుడును అమాంతం పెంచేశారు. అదే ఇప్పుడు ఆయన కొంప కొల్లేరు చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐకి ఓ లేఖ అందింది. ఇప్పుడదే క్రీడారంగంలో హాట్ టాపిక్ గా మారింది.

ఐదో వన్డేల సిరీస్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రవిశాస్త్రి పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక గ్రేట్ వికెట్ అంటూ వ్యంగ్యంతో మొదలు పెట్టి అతను మరాఠీలో బూతు పురాణం లంకించుకోవడంతో అక్కడ ఉన్నవారందరూ విస్తుపోయారు. తాము కోరినట్లుగా స్పిన్ పిచ్ రూపొందించలేదంటూ వాంఖడే క్యురేటర్ సుధీర్ నాయక్‌ పై విరుచుకుపడ్డాడు. ఇప్పుడా ఘటన మరింత జటిలంగా మారుతోంది. ఈ విషయాన్నిభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దృష్టికి తీసుకువెళ్లిన సుధీర్ నాయక్... తనను రవిశాస్త్రితోపాటు, కోచింగ్ స్టాఫ్ మెంబర్ అయిన భరత్ అరుణ్ ఇద్దరూ అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో విజ్ఞప్తి చేశాడు. పిచ్ అంశాన్ని లేఖలో ప్రస్తావించిన సుధీర్ నాయక్... సాధారణంగా టీమ్ మేనేజ్ మెంట్ అడిగిన పిచ్ తయారు చేయడానికి కనీసం 10 నుంచి 12 రోజుల ముందుగానే తెలియజేస్తారన్నాడు. అయితే ముంబై వాంఖడే పిచ్ విషయంలో మాత్రం ముందుగా తమకు ఎటువంటి పిచ్ కావాలన్నది తెలియచేయలేదన్నాడు.

మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందే టర్నింగ్ వికెట్ కావాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరినట్లు సుధీర్ నాయక్ పేర్కొన్నాడు. దీంతో తమ శాయశక్తులా ప్రయత్నించి పిచ్ ను రూపొందించామన్నాడు. పిచ్ లో నీటిని తొలగించడమతోపాటు గడ్డిని కూడా రోలింగ్ చేసి పూర్తిగా చదును చేశామన్నాడు. తమకు ఏ పని అయితే చెప్పారో అది సమర్ధవంతంగా చేశామన్నాడు. ముందు రోజు గుడ్ లెంగ్త్ ప్రాంతంలో నీటిని చల్లమని మేనేజ్ మెంట్ తెలిపినా.. రెండు వేర్వేరు పిచ్ లు తయారు చేయడం మంచిది కాదనే సలహాతోనే దాన్నిపక్కకు పెట్టామన్నాడు. దీనిపై బీసీసీఐ క్యూరేటర్ ధీరజ్ ప్రసన్న స్పష్టం చేసిన మార్గదర్శకాలను కూడా పాటించినట్లు ఆయన వివరించాడు. అయినప్పటికీ తనపై బూతులు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని, ఏదేమైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సుధీర్ నాయక్ లేఖలో కోరాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudhir naik letter  ravi shastri blame controversy  wankhade stadium  

Other Articles