gagan khoda feeling surprised and heppy for selected as national selector | bcci | shashank manohar

Gagan khoda feeling surprised by call to become national selector

gagan khoda, bcci, shashank manohar, msk prasad, roger binny, central zone, bcci meeting

gagan khoda feeling surprised by call to become national selector : Gagan Khoda, who played for Rajasthan in the Ranji Trophy, has been appointed in the BCCI senior selection committee member as representative from Central Zone.

బీసీసీఐ నిర్ణయంతో ‘షాక్’తిన్న మాజీ క్రికెటర్

Posted: 11/10/2015 07:01 PM IST
Gagan khoda feeling surprised by call to become national selector

శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే! కొందరు సీనియర్ ఆటగాళ్లను ఆయా పదవుల నుంచి తొలగిస్తూ.. వారి స్థానాల్లో ఇతర సీనియర్ ప్లేయర్స్ కి అవకాశాలు కల్పించారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలికి.. వారి వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా-రాజస్థాన్ మాజీ ఓపెనర్ గగన్ ఖోడాలను నియమించారు. ఈ విధంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ గగన్ తెలిపాడు.

బీసీసీఐ నుంచి ఫోన్ రావడం తనను ‘షాక్’కి గురి చేసిందని గగన్ ఖోడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో విధులు నిర్వర్తించే తాను గత కొద్ది రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నానని... అయితే, సీనియర్ జట్టు సెలెక్టర్ గా ఎంపికయ్యానని బీసీసీఐ నుంచి ఫోన్ రావడంతో ఆశ్చర్యంతోపాటు ఆనందానికి లోనయ్యానని ఆయన చెప్పాడు. కేవలం రెండు సిరీసుల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన గగన్ ఖోడాను సెంట్రల్ జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ ఎంపిక చేయడం విశేషం. కాగా, సౌత్ జోన్ నుంచి ఆంధ్రాక్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ను కూడా సెలెక్టర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెస్కే గతంలో టీమిండియా సాంకేతిక నైపుణ్యం పెంపుదల విభాగంలో సేవలందించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gagan khoda  bcci  shashank manohar  

Other Articles