According to report india pakistan bilateral series to be played in srilanka or bangladesh | indo-pak series

India pakistan bilateral series to be played in srilanka or bangladesh

india pakistan series, indo pak bilateral series, india pakistan full series, bcci chief shashank manohar, pcb chief shaharyar khan, indo pak cricket matches, india vs pakistan

India Pakistan bilateral series to be played in Srilanka or Bangladesh : BCCI game to play Pakistan in Bangladesh or Sri Lanka.

భారత్-పాక్ సిరీస్ పై ఆ రచ్చ కొలిక్కి వచ్చిందట!

Posted: 11/23/2015 04:12 PM IST
India pakistan bilateral series to be played in srilanka or bangladesh

2007లో భారత్-పాక్ దేశాల క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత ముంబై దాడుల కారణంగా రెండు దేశాల మధ్య ఎలాంటి సిరీస్ జరగలేదు. అయితే.. గతేడాది ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి సిరీస్ కు సంబంధించి తొలి అడుగు పడింది కానీ.. వేదికపైనే దాయాది దేశాల క్రికెట్ బోర్డులు విరుద్ధ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ సిరీస్ ను యూఏఈ వేదికగా నిర్వహిద్దామని వాదన వినిపిస్తే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ వాదనను తోసిపుచ్చి ఇండియాలోనే నిర్వహిద్దామని పిసీబీకి ప్రతిపాదించింది. ఆ వెంటనే పీసీబీ కూడా అందుకు విరుద్ధంగానే తన సమాధానాన్ని తెలిపింది. యూఏఈలో అయితేనే సిరీస్ ఆడుతామంటూ పీసీబీ తేల్చిచెప్పేసింది. దీంతో ఈ సిరీస్ వుంటుందా..? వుండదా..? అనే అనుమానాలు తెరమీదకి వచ్చేశాయి.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇరుదేశాల క్రికెట్ బోర్డులు వేదికకు సంబంధించిన వ్యవహారంపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ‘వేదిక’ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఇద్దరూ దుబాయ్ లో భేటీ అయ్యారు. విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదరుచూస్తున్న ఈ ద్వైపాక్షిక సిరీస్ నిర్వణకు సంబంధించి వీరిమధ్య సుధీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. వేదికలకు సంబంధించి ఒకరి ప్రతిపాదన మరొకరు తిరస్కరించిన నేపథ్యంలో.. ఇరుదేశాలకు సమీపంలోని శ్రీలంకను వేదికగా చేసుకునే అంశం కూడా వీరిమధ్య చర్చకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. యూఏఈ కంటే శ్రీలంకనే వేదికగా ఈ సిరీస్ ని నిర్వహిస్తే.. ఇరుదేశాలకు అనుకూలంగా వుంటుందని శశాంక్ తన అభిప్రాయాన్ని తెలపడంతో.. అందుకు షహర్యార్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ శ్రీలంకలో కుదరని పక్షంలో ఈ సిరీస్ ను బంగ్లాదేశ్ లో నిర్వహించాలని వారిద్దరూ చర్చించికున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india pakistan bilateral series  shashank manohar  shaharyay khan  

Other Articles