Shahid Afridi spoke his mind, nothing controversial in it says waqar younis

Nothing controversial in afridi s remarks says waqar younis

icc world t20, wt20, wt20 india, wt20 pakistan, pakistan, pakistan cricket, pak, pak cricket, Waqar Younis, Shahid Afridi, love comments, T20 World cup, waqar, cricket

Pakistan start their campaign against Bangladesh on 16th March, who had shocked them at the Asia Cup.

అఫ్రిదీ ప్రేమ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు..

Posted: 03/15/2016 07:45 PM IST
Nothing controversial in afridi s remarks says waqar younis

తమ దేశ అభిమానుల కన్నా అధికంగా భారత్ లో తమను అభిమానులు ఆదరాభిమానాలతో ప్రేమ చూపుతున్నారని పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ వకార్ యూనిస్ మద్దుతుగా నిలిచాడు. షహీద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. షాహీద్ అప్రీదీపై కురుస్తున్న విమర్శల వర్షాన్ని కొద్దిమేరకు తగ్గించే ప్రయత్నం చేశాడు.

భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీనిపై మాజీ కెప్టెన్ మియాందాద్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డాడు. కాగా, టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తామని వకార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బాగా ఆడుతోందని, ఆ జట్టును ఆషామాషిగా తీసుకోబోమని చెప్పాడు. ఆఫ్రిదికి ఒంట్లో బాలేకపోవడంతో ఈరోజు ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించాడు. రేపటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Waqar Younis  Shahid Afridi  love comments  T20 World cup  

Other Articles