భారత్‌లోనే పాకిస్థాన్ క్రికెటర్లకు అమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న తన వ్యాఖ్యలపై తన స్వదేశంలో విమర్శలు వస్తుండటంతో పాక్ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వివరణ ఇచ్చుకున్నాడు. తన దేశాన్ని, స్వదేశంలోని అభిమానులను చిన్నబుచ్చే ఉద్దేశం తనకు లేదని, అయితే భారత్ లోని అభిమానులపై గౌరవాన్ని చాటుతూ సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే తాను చేశానని ఆయన పేర్కొన్నాడు. తాను పాకిస్థాన్ జట్టుకు సారథిని మాత్రమే కాదు, పాక్ ప్రజలందరి తరఫున ప్రతినిధినని చెప్పుకోచ్చారు.
తన వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాలని విన్నవించారు. పాకిస్థాన్ అభిమానుల కన్నా ఇతరులెవరూ తనకు ఎక్కువనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదున్నారు. తనకు ప్రస్తుతమున్న ఈ గుర్తింపు మొత్తం పాకిస్థాన్ నుంచి వచ్చిందేనని అఫ్రిది పేర్కొన్న ఆడియో సందేశాన్ని పీసీబీ తన ట్విట్టర్‌లో పేజీలో పోస్టు చేసింది. అఫ్రిదీ గత ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు.
కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తోపాటు పలువురు అఫ్రిది వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల వివాదాన్ని చల్లబర్చేలా పత్రికా ప్రకటన చేసిన అఫ్రిది.. సానుకూల దృక్పథంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది కాబట్టి భారత్‌లో ఆడినప్పుడు మేం బాగా ఆస్వాదిస్తామని చెప్పానని, ఇదేమాటను గతంలో వసీం అక్రం, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్ కూడా చెప్పారని అఫ్రిది గుర్తుచేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more