ICC World T20: Batting let us down, says MS Dhoni

India loose the match aginst new zealand

india vs new zealand, ind vs nz, india cricket team, india cricket, icc world t20, world cup 2016, t20 world cup 2016 schedule, t20 world cup, world t20 2016, ms dhoni, dhoni, cricket score, cricket news, cricket

India's famed batting line-up showed poor skills and application to lose World T20 against New Zealand.

చెత్త షాట్లను కోట్టబోయే వికెట్లను కోల్పోయాం

Posted: 03/17/2016 08:05 AM IST
India loose the match aginst new zealand

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆసియా కప్ విజేతగా, స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కాబట్టి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్ లోనే భంగపడింది. న్యూజిలాండ్ చేతిలో 47 పరుగుల పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో అసలే దిగ్గజ జట్లున్న పూల్ 'బి' లోని భారత్ తన అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్లయింది. మ్యాచ్ ఆద్యంతం పరిశీలిస్తే వ్యూహాల పరంగా టీమిండియా కంటే న్యూజిలాండ్ దే పైచేయి అని విశ్లేషకుల భావన.

టాస్ కు ముందే న్యూజిలాండ్ ముగ్గురు ప్రొఫెషనల్ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. కివీస్ తన తురుపుముక్క టిమ్ సౌథీని పక్కనపెట్టిమరీ మరో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోవటం ద్వారా లాభపడింది. టాస్ సందర్భంగా వ్యాఖ్యాత ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ ధోనీ వద్ద ప్రస్తావించగా 'పార్ట్ టైమ్ స్పిన్నర్లతో పనికానిచ్చేస్తాం' అని సమాధానమిచ్చాడు. అయితే అశ్విన్ కు తోడు హర్భజన్ లాంటి ఫుల్ టైమ్ స్పిన్నర్ అవసరం ఎంతుందో ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాతగానీ తెలిసిరాలేదు.

పేవలమైన షాట్లు కొడుతూ కివీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరే అవుటవుతుండటం భారత్ అభిమానులను సంతోషపర్చినా.. మనవాళ్లు కూడా కొట్టిన అదే రకం పేవలమైన షాట్లే కొంపముంచాయని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ధోనీ అన్నాడు. భారత్ బ్యాట్స్ మన్లు చెత్త షాట్లకు అవుట్ కావడంవల్లే ప్రతికూల ఫలితాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్ సన్ మాట్లాడుతూ 126 డిఫెండింగ్ స్కోరేనని, సౌథీని పక్కన పెట్టాలనే సంచలన నిర్ణయం వర్క్ అవుట్ అయినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ లో స్లో పిచ్ లపై వరుస విజయాలు సాధించిన భారత్.. స్వదేశంలో ఇలా చతికిలపడిపోవటం అభిమానులను నిరాశపరుస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  team india  ms dhoni  new zealand  

Other Articles