Zaheer Khan to lead Delhi Daredevils in IPL 2016

Zaheer khan to captain daredevils in ipl 2016

How Zaheer became deadly, India's all-round, all-purpose match-winner, Zaheer Khan, Indian Premier League, Delhi Daredevils cricket, India cricket

Zaheer Khan has been appointed as captain of the Delhi Daredevils for the 2016 IPL season.

ఢిల్లీ డేర్ డెవిల్స్ పగ్గాలను అందుకున్న జహీర్

Posted: 03/29/2016 01:25 PM IST
Zaheer khan to captain daredevils in ipl 2016

ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 సీజన్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ పగ్గాలను భారత మాజీ పేసర్ జహీర్ఖాన్ అందుకున్నాడు. ఆయనను ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వరుసగా రెండో సంవత్సరం ఆడుతున్న జహీర్ కు సారథిగా కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. రాబోవు ఐపీఎల్ సీజన్ లో జహీర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది..
 
దీనిపై ఆ జట్టు సలహాదారు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ..  ఆటలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాక్ లో నాయకత్వ లక్షణాలకు కొదవలేదని పేర్కొన్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జహీర్ నియామకం పట్ల యాజమాన్యం సంతృప్తిగా ఉందన్నాడు. ఈ సందర్భంగా జహీర్ కు ముందుగా ద్రవిడ్ అభినందనలు తెలియజేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన జహీర్.. 200 వన్డేల్లో 281 వికెట్లు తీయగా, 92 టెస్టుల్లో 311 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున 17 ట్వంటీల్లో 17 వికెట్లు తీశాడు..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaheer Khan  Delhi Daredevils  IPL  captain  cricket  

Other Articles