virat kohlis placement of shots is better than brian lara says ian chappell

Virat kohli better than brian lara says ian chappell

india vs australia, australia vs india, ind vs aus, aus vs ind, Icc World T20. Ian Chappell, Virat Kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, Shane Watson, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Former Australian captain Ian Chappell said Virat Kohli is better than Brian Lara as far as placement of the ball was conerned.

టీమిండియాకు కోహ్లీ ది వాల్ గా అభివర్ణించిన చాపెల్

Posted: 03/29/2016 02:02 PM IST
Virat kohli better than brian lara says ian chappell

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై రోజురోజుకీ క్రికెట్ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతూనే వున్నాయి. తాజగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్ ఇయాన్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ఆల్ టైమ్  గ్రేట్ ఫినిషర్ అంటూ చాపెల్ పొగడ్తలతో ముంచెత్తాడు. అతను మణికట్టుతో బంతిని హిట్ చేసే విధానం అమోఘమన్నాడు. వరల్డ్ కప్ లో ఆసీస్పై విరాట్ అజేయంగా నమోదు చేసిన 82 పరుగులు అతని ట్వంటీ 20 ఇన్నింగ్స్లలోనే ఉత్తమంగా చాపెల్ అభివర్ణించాడు.
 
వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా కచ్చితమైన ప్లేస్ మెంట్ తో కొట్టే షాట్లను విరాట్ అధిగమించాడని అభిప్రాయపడ్డారు. ప్లేస్ మెంట్లో లారాను వెనక్కు నెట్టిన కోహ్లి అగ్రస్థానంలోకి వచ్చాడని పేర్కోన్నాడు. కోహ్లిని చూస్తే అటు రాహుల్ ద్రావిడ్ కు వున్న బిరుదును కూడా చెరిపేస్తున్నాడని, విరాట్ ఇప్పుడు టీమిండియాకు గోడలా కనిపిస్తున్నాడని అన్నారు.  ఛేజింగ్ లో  కోహ్లి ఉత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని అభినందించాడు.

గతంలో హోబార్ట్ లో శ్రీలంక300 పైగా స్కోరును నమోదు చేస్తే కోహ్లి అజేయ సెంచరీతో ఆ మ్యాచ్ ను 36.4 ఓవర్లలోనే ముగించాడు. ఆ తరువాత మరే ఇతర ఆటగాడు ఇంతలా ఛేజింగ్ చేయడం తాను చూడలేదన్నాడు. మణికట్టుతో పవర్ ఫుల్ షాట్లు ఆడగల అరుదైన క్రికెటర్లలో కోహ్లి ఒకడని.. అది అందరికీ సాధ్యం కాదన్నాడు. భారత్ తరపున మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లే ఆ తరహా ఆడేవారు. ఇప్పుడు కోహ్లి ఆటతీరు వారిని గుర్తుకుతెస్తుందని చాపెల్ కొనియాడాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ian Chappell  india  australia  world twenty 20  semi finals  ind vs aus  cricket  

Other Articles