IPL 2016: SLC reluctant to give Lasith Malinga NOC to play in cash-rich league

Slc reluctant to give malinga noc for ipl

ipl 2016, ipl news, ipl updates, ipl fixtures, lasith malinga, lasith malinga injured, lasith malinga injury, malinga injury, no objection certificate, sri lanka cricket board, SLC chief Tilanga Sumathipala, captaincy, mumbai indians, cricket

Lasith Malinga and the new SLC hierarchy have been at a standoff since the Asia Cup T20 in February.

ఐపీఎల్ లో మలింగ అడేందుకు అనుమతి నిరాకరణ

Posted: 04/13/2016 01:53 PM IST
Slc reluctant to give malinga noc for ipl

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్లో ఆడే అవకాశాలు లేనట్టే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతని నిరాకరించింది, ఐపీఎల్ లో ఆడేందుకు ఆయన శ్రీలంక బోర్డు నుంచి పోందాల్సిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) విషయంలో బోర్డు జాప్యం చేస్తుంది. శ్రీలంక బోర్డుపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై గుర్రుగా వున్న బోర్డు ఈ మేరకు ఆయనపై కసి తీర్చుకుంటుందన్న వాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

పలు టోర్నమెంటులలో ఆటడం, పలు టోర్నీలను వదిలేయడం చేస్తున్న మలింగ వ్యవహారశైలిని గమనించిన బోర్డు, ఆయన టోర్నీలను ఎంచుకోవడం తప్పుగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్వహించిన ప్రపంచ కప్ ఫోట్టి ఫార్మెట్ కప్ టోర్నీకి ముందే ఆయనను కెప్టెన్సీ పగ్గాలను వదులుకోవాలని అదేశించింది, అయితే జట్టు తరుపున అడేందుకు జట్టులో స్థానం సంపాదించిన మలింగ.. కాలు గాయం కారణంగా ఫోట్టి ఫార్మెట్ నుంచి నిష్కమించాడు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో అడేందుకు మలింగా ప్రస్తుత ఫిట్నెస్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాతే ఎన్ఓసీ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తామని లంక క్రికెట్ బోర్డు చీఫ్‌ తిలంగ సుమతిపాల చెప్పారు. తమ అనుమతి లేకుండా మలింగా ఐపీఎల్లో ఆడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిలంగ సుమతిపాలకు, మలింగాకు మధ్య ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అడేందుకు అనుమతి ఇచ్చేందుకు లంక బోర్డు నిరాకరిస్తూ అతనిపై కక్షసాధిస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles