Ex-West Indies cricketer Franklyn Rose jailed, deported from New zealand

Franklyn rose deported from auckland

Franklyn Rose, Cricket, Deported, Auckland, West Indies, Michael Woodhouse, new zealand, fast bowler, Auckland University Cricket Club, Trinidad, work permit, Mount Eden Prison, Jamaica

Former West Indies cricketer Franklyn Rose has been sent deported back to his hometown Trinidad after overstaying his work visa.

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ పై దేశ బహిష్కరణ వేటు

Posted: 04/13/2016 02:25 PM IST
Franklyn rose deported from auckland

వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్ పై న్యూజీలాండ్ దేశ బహష్కరణ వేటు వేసింది. ఆయనను ఉన్నఫలంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోవాలని అదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల శిక్షణలో భాగంగా ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ కు వచ్చిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోస్ వర్క్ వీసా గడువు ముగిసినా కూడా ఆ దేశం విడిచి వెళ్లకపోవడంతో అతనిపై బహిష్కరణ వేటు పడింది.  

44 ఏళ్ల ఫ్రాంక్లిన్ తన దేశానికి మూడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. డేరెన్ పావెల్, మెర్విన్ డిల్లాన్ లతో పాటు వెస్టిండీస్ పేస్ బౌలర్ రాణించాడు. అయితే వారంతంగా తాను అంతర్జాతీయ క్రికెట్ లో రాణించలేకపోయాడు, తన దేశం తరుపున ఫ్రాంక్లిన్ 19 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 53 వికెట్లు సాధించగా, వన్డేలో 29 వికెట్లు తీశాడు. కాగా తన టాలెంట్ తో జట్టులో మెరవాల్సిన ఫ్రాంక్లిన్ అంచనాలకు తగ్గుట్టుగా రాణించలేకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు,

ఈ క్రమంలో న్యూజీలాంట్ ప్రభుత్వం నుంచి ఆయనకు క్రికెట్ కోచ్ గా వ్యవహరించేందుకు వర్క్ పర్మిట్ వచ్చింది, అక్లాండ్ యూనివర్సిటీ క్లబ్ క్రికెట్ కోచ్ గా ఆయన బాధ్యతలు నిర్వహించాడు, కాగా 2012లో ఆయన వీసా గడువు ముగిసిపోయింది, అయినా న్యూజీలాండ్ లో ఆయన నివసించడంతో ఆయనపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు విచారణను ఎదుర్కెన్న ఫ్రాంక్లిన్  ఇప్పటికే ఐదు వారాలు జైలు శిక్ష అనుభవించాడు. కాగా తాజాగా ఆయనపై దేశబహిష్కరణ వేటు వేస్తూ తక్షణం ఆయనను తన స్వదేశానికి వెళ్లాలని న్యాయస్థానం అదేశించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Franklyn Rose  cricketer  west indies  new zealand  fast bowler  

Other Articles