ధోనీని కాదని కోహ్లీతో... | BCCI seeks kohli suggestion for coach selection

Bcci seeks kohli suggestion for coach selection

Virat kohli key for coach selection, BCCI, Indian new coach, Kumble and Shastri, కోచ్ కోసం కోహ్లీ, ధోనీని కాదని కోహ్లీతో, కోహ్లీ కోచ్ కోసం, కోచ్ కోసం కోహ్లీ, కోహ్లీయే కీలకం, sports news, team india new coach, cricket news, తాజావార్తలు, క్రీడా వార్తలు, క్రికెట్ వార్తలు

Kohli asked to choose between Kumble and Shastri for team India coach.

ధోనీని కాదని కోహ్లీతో...

Posted: 06/22/2016 03:37 PM IST
Bcci seeks kohli suggestion for coach selection

భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 20 మందికి వీరు మౌఖిక పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇక ఈ జాబితాలో కుంబ్లే, రవిశాస్త్రి కూడా ఉన్నారు. ఒకప్పటి తమ సహచరులు, ఇప్పడు ఇంటర్వ్యూ పెద్దల స్థానంలో కూర్చోగా వారి ప్రశ్నలకు వీరిద్దరు ఓపికగా సమాధాలిచ్చారంట. కుంట్లే స్వయంగా హజరుకాగా, రవిశాస్త్రి మాత్రం థాయ్ లాండ్ లో ఉండటం మూలంగా స్కైప్ లో హాజరయ్యాడు.
 
భారత కోచ్ గా దాదాపు కుంబ్లే ఖరారు కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతుండగా, శాస్ర్తి నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతుందని తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం విరాట్ కోహ్లీని సంప్రదించాలని బోర్డు భావిస్తోంది. కుంబ్లే, రవిశాస్త్రి ఇద్దరిలో ఒకరిని ఎంచుకునేందుకు కోహ్లీ సాయం కోరనందట. అతనిచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కోచ్ ఎంపిక ఉంచొచ్చని తెలుస్తోంది. అయితే కుంబ్లేకు కోచ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

వీరితోపాటు సందీప్ పాటిల్ విదేశీయులు టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ప్రజెంటేషన్‌ను అందించారు. కమిటీ తన నివేదికను బుధవారం బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కేకు సమర్పించే అవకాశం ఉంది. 24న జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో అధికారికంగా కోచ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat kohli  BCCI  team Indian new coach  

Other Articles