టీమిండియా కొత్త కోచ్ గా కుంబ్లే | Anil Kumble new coach for Team India

Anil kumble new coach for team india

Anil Kumble new coach, Team India New Coach, Anil Kumble coach for team India, sports news, kumble new coach for team India, kumble new coach, కుంబ్లే కొత్త కోచ్, టీమిండియా కొత్త కోచ్, స్పిన్ దిగ్గజానికి కోచ్ పగ్గాలు, india new coach

Spin Legend Anil Kumble new coach for Team India.

టీమిండియా కొత్త కోచ్ గా కుంబ్లే

Posted: 06/23/2016 05:30 PM IST
Anil kumble new coach for team india

రెండేళ్లుగా పగ్గాలు లేకుండా కొనసాగుతున్న జట్టుకు కళ్లెం వేసేందుకు కొత్త కోచ్ రాబోతున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కు దాదాపుగా కోచ్ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ గా స్వదేశానికి చెందిన వ్యక్తే ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. గురువారం ధర్మశాలలో జరిగిన కీలక భేటీలో కుంబ్లే నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనిపై బోర్డు అదికారిక ప్రకటన చేయనుంది.

ముందుగా హెడ్ కోచ్ ను ఎంపిక చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీకి బీసీసీఐ సూచించింది. మూడు రోజులుగా ఏకధాటిగా ఇంటర్వ్యూలు నిర్వహించిన వీరు బీసీసీఐకి రెండు రోజుల క్రితమే అందజేశారు. మొత్తం 57 దరఖాస్తులు దాఖలు కాగా... వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ తదదతరులతో పాటు పలువురు విదేశీ దిగ్గజాల దరఖాస్తులు కూడా ఉన్నాయి. అయితే అందరిలో కుంబ్లే వైపే వీరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

మరోవైపు  కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, త్రిసభ్య కమిటీలోని సౌరవ్ గంగూలీ కీలక భూమిక పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డంకన్ ఫ్లెచర్ పదవీ విరమణ తర్వాత దాదాపుగా రెండేళ్లుగా కోచ్ లేకుండానే టీమిండియా కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ, అప్పుడు బోర్డు డైరక్టర్ గా ఉన్న రవిశాస్త్రి ఆ లోటును భర్తీ చేస్తూ వచ్చారు. హెడ్ కోచ్ గా కుంబ్లే ఉన్నప్పటికీ బ్యాటింగ్ కోచ్ గా శాస్త్రి కొనసాగుతారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Team India  New Coach  BCCI  

Other Articles