ఈజీగా.. వీజీగా... తొలిసారి | india 10 wickets victory against zimbambwe in 2nd T20

India 10 wickets victory against zimbambwe in 2nd t20

10 wickets t20 victory for team India, india 10 wickets victory against zimbambwe, జింబాబ్వే పై పది వికెట్ల విక్టరీ, టీ20లొ అరుదైన రికార్డు, పది వికెట్ల తేడాతో ఫస్ట్ టైం, స్పోర్ట్స్ న్యూస్, క్రీడావార్తలు, జింబాబ్వే టూర్, భారత్ జింబాబ్వే టీ20, తెలుగు వార్తలు, తాజా వార్తలు

india 10 wickets victory against zimbambwe in 2nd T20. First did 10 wickets victory in T20.

ఈజీగా.. వీజీగా... తొలిసారి

Posted: 06/21/2016 03:49 PM IST
India 10 wickets victory against zimbambwe in 2nd t20

మొదటి టీ20లో రెండు పరుగుల ఓటమిపైనా బారత జట్టుపై తీవ్ర విమర్శలు కురిపించారు సీనియర్లు. దీంతో రెండో దాంట్లో రెచ్చిపోయి ఆడింది. ఫలితం సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆతిధ్య జింబాబ్వే చిత్తుచిత్తు అయిపోయింది. కొత్త కుర్రాళ్లు బరీందర్, బుమ్రాలు బంతితో రాణిస్తే... మన్ దీప్, రాహుల్ లు బ్యాట్ ఝుళిపించారు.

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 99 పరుగులకే చాపచుట్టేసింది. మూడో ఓవర్లో మొదలైన బరీందర్ మ్యాజిక్ ఐదో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మధ్యలో మూర్ (31) కాసేపు తట్టుకుని నిలుచినప్పటికీ తర్వాత బ్రుమా దాటికి మిగతా వారంతా త్వరగానే పెవిలియన్ చేరిపోయారు. బరీందర్ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా  4 ఓవర్లలో 11 పరుగులకు 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక స్వల్ఫ లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు కుర్రాళ్లు రాహుల్, మన్ దీప్ లు ఆడుతూ పాడుతూ గెలిపించేశారు. రాహుల్ 47, మన్ దీప్ 52 అర్థ సెంచరీలతో పని కానిచ్చేశారు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బరీందర్ స్రాన్ కు దక్కింది. ఇంకా ఒక టీ20 ఉండగా, ప్రస్తుతం సిరీస్ 1-1గా ఉంది. కాగా, టీ20 ఛాంపియన్ అయిన భారత్ కు పది వికెట్లతో ఘనవిజయం సాధించడం ఇది తొలిసారి కావటం విశేషం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team India  T20 Zimbambwe  second T20  

Other Articles