Owners 'surprised' by mini IPL announcement

Mini ipl on the cards in september

BCCI, Anurag Thakur, Indian Premier League (IPL), IPL indian premier league, mini IPL outside india, T20 cricket, cricket news, cricket

The BCCI is set to introduce a new Twenty20 event, to be branded as mini IPL, outside India in September.

సెప్టెంబర్ లో విదేశాలలో మినీ ఐపీఎల్..

Posted: 06/25/2016 04:36 PM IST
Mini ipl on the cards in september

ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్ ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రధానంగా భారత్లో జరిగే ఐపీఎల్ను ఇక నుంచి విదేశాల్లో కూడా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. కాగా, భారత్కు బయట జరిపే ఈ టోర్నీని 'మినీ ఐపీఎల్' పేరుతో నిర్వహించనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా వేదికల అన్వేషణలో ఉన్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఈ టోర్నీని సెప్టెంబర్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు అనురాగ్  పేర్కొన్నారు.

ఇందుకు యూఎస్తో పాటు యూఏఈ వేదికలు పరిశీలనలో ఉన్నాయి. 2014లో ఐపీఎల్ టోర్నీ జరిగిన యూఏఈలో మినీ టోర్నీ నిర్వహించడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇదిలా ఉండగా, రంజీ ట్రోఫీ టోర్నీలను తటస్థ వేదికలపై నిర్వహించడానికి వర్కింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్త టీ 20 లీగ్ను నిర్వహించడానికి కూడా అంగీకారం తెలిపింది.

అయితే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో సెప్టెంబర్ లో మిని ఐపీఎల్ నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన సిరీస్ రసకందాయంలో పడింది. ఇప్పటికే అత్యంత బిజీ గా వున్న యూఏఈ స్టేడియాలులో పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య యూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్ లతో సిరీస్ జరగనుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడే మినీ ఐపీఎల్ నిర్వహిస్తామని బిసిసిఐ ప్రకటించడంతో పాక్ సిరీస్ కు అది అవరోధం కలగకుండా వుండాలంటే బిసిసిఐ ఇప్పుడే తేదీలను ఖరారు చేసి.. స్టేడియం నిర్వాహకులకు తెలిపాలని కోరుతున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  Mini Ipl  Indian premium league  BCCI  cricket  

Other Articles