Mitchell Starc can become one of Australia's bowling greats: Darren Lehmann

Lehmann backs mitchell starc to take 300 test wickets

Mitchell Starc,Starc 300 Test wickets,Darren Lehmann,Australia vs Sri Lanka,Glenn McGrath,Mitchell Johnson, 300 wickets club, srilanka, reverse swing

Australia coach Darren Lehmann said Mitchell Starc has the ability to pick up 300 wickets and join the likes of Glenn McGrath, Dennis Lillee, Brett Lee and Mitchell Johnson, if he stays fit.

రికార్డులు తిరగరాసే సత్తా వున్న బౌలర్..

Posted: 07/12/2016 01:17 PM IST
Lehmann backs mitchell starc to take 300 test wickets

అసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలర్ గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోచ్ డారెన్ లీమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అతడు ఫిట్నెస్ కాపాడుకుంటే టెస్టుల్లో తమ జట్టు తరపున అరుదైన మైలురాళ్లను అధిగమిస్తాడని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 300 వికెట్ల క్లబ్ లో చేరడంతో పాటు ఆసీస్ దిగ్గజ బౌలర్ల సరసన చోటు సంపాదిస్తాడని అన్నాడు.మిచెల్ స్టార్క్ రికార్డులను తిరగరాసే అవకాశం కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. మిచెల్ జాన్సన్ రిటైర్ కావడంతో అతడి వారసుడిగా స్టార్క్ ను పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 91 వికెట్లు తీశాడు. మోకాలి ఆపరేషన్ అనంతరం గతనెలలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో స్టార్క్ సత్తా చాటాడు. మెక్గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ(355), జాన్సన్(313), బ్రెట్ లీ(310) ఆస్ట్రేలియా తరపున 300 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్లుగా ఘనత సాధించారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ, ఎక్కువ మ్యాచ్లు ఆడితే స్టార్క్ కూడా 300 టస్టు వికెట్లు సాధిస్తాడని లీమాన్ చెప్పాడు. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ స్వింగ్ తో అతడు చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mitchell Starc  Australia paceman  Darren Lehmann  300 wickets club  srilanka  reverse swing  

Other Articles