మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతితో బాగా రాణించడంతో భారత్ పర్యాటక జట్టుపై అధిక్యం కనబర్చింది, 239/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన కోహ్లీసేన మరో 77 పరుగులను జత చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయి 316 పరుగుల వద్ద అలౌట్ అయింది. భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించేందుకు రెండో రోజున మిడిల్అర్డర్ అల్ రౌండర్ వృద్దిమాన్ సాహ దోహదపడ్డారు.
తొలిరోజు 14 పరుగులు సాధించిన సాహ.. రెండో రోజు 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థశతకాన్ని నమోదు చేశాడు, ఆ తరువాత కేవలం నాలుగు పరుగులు మాత్రమే సాధించి 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ మూడు వంద మార్కును దాటింది. అంతకుముందు రవీంద్రజడేజా కేవలం 14 పరుగులకే ఔటయ్యి వెనుదిరిగాడు. . న్యూజిలాండ్ అటాక్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. టెయిలెండర్ మొహ్మద్ షమీ(14)తో కలిసి చివరి వికెట్ కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు.
అంతకుముందు భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(87), అజింక్యా రహానే(77)లు జట్టును ఆదుకున్నారు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లతో సత్తా చాటగా, బౌల్ట్ , వాగ్నర్, జీతన్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించారు. 317 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ భారత్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. భారత పేసర్లు విసిరిన బంతులకు బొక్కబోర్లాపడింది.
రెండో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజీలాండ్ ను భవనేశ్వర్ కుమార్ ధాటిగా దెబ్బతీశాడు. వరుణుడు మధ్యలో అటకు అటంకాన్ని కల్పించినా.. భువనేశ్వర్ రెండో స్పెల్ లో వరుసగా రెండు బంతులకు ఇద్దరు కివీస్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ ను పంపి మరో ఫిఫర్ (ఐదు వికెట్ల రికార్డును) తన ఖాతాలోకి వేసుకున్నాడు, కేవలం పది ఓవర్లలో 33 పరుగులను ఇచ్చిన భువి.. ఐదు వికెట్లను పడగోట్టాడు. భువికి తోడుగా షమీ, జడేజాలు కూడా చెరో వికెట్ సాధించారు. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లలో రాస్ టైలర్ 36 పరుగులతో, లూక్ రాంచీ 35 పరుగులతో రాణించారు. కాగా మిగిలిన బ్యాట్స్ మెన్లు అందరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more