టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రెండో ఇన్నింగ్స్ లో దమాకాధార్ షాట్లు కోడుతున్నాడు. అయన చేతుల నుంచి జాలువారిన షాట్లు సోషల్ మీడియాలో బాగా పేలుతున్నాయి, అర్థమైంది కదా.. ఆయన రెండో ఇన్నింగ్స్ షోషల్ మీడియా వేదికగా సాగుతున్న విషయం అయన అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే ఏం సందర్భం వచ్చినా సమయానుకూలంగా కొంత వ్యంగంగా స్పందించే భిన్నమైన మనసత్తత్వం అయనది.
నిన్న మోన్నటి వరకు ఇంగ్లాండ్ జర్నలిస్టును ఉతికి అరేసిన సెహ్వాగ్.. ఈసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును టార్గెట్ చేశాడు. అదేంటి అసీస్ ను ఎందుకు టార్గెట్ చేశాడు, క్రికెట్ ప్రపంచంలో ప్రత్యర్థి జట్లకన్నా పైచేయిలో కొనసాగుతున్న కంగారులను ఆయన తన ట్విట్లతో కంగారు పెట్టించాడు. ఇందుకు కారణం దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఘోర పరాజయం చెందడమే.ఒకవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చేతిలో తీవ్రంగా భంగ పడిన ఆస్ట్రేలియా పూర్తిగా డైలామాలో పడితే... ఆ జట్టును ఏం బాదావంటూ మన 'ట్విట్టర్ కింగ్' సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
'డీ కాక్.. వాట్ ఎ నాక్.. ధమాకా దార్ నాక్' అంటూ కొనియాడాడు. కేవలం ఒక్కడికి దాసోహమైన ఆసీస్‌కు ఇద్ది పెద్ద షాక్ అంటూ ట్వీట్ చేశాడు. సెంచూరియన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విసిరిన 295 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై డీకాక్ (178:16 ఫోర్లు, 11 సిక్సర్లు) విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 36.2 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more