పరుగులు చేయడానికి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ అంత కష్టమైన పిచ్ కాదని టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే అన్నాడు. చతేశ్వర్ పుజారా(87)తో కలిసి విలువైన 141 పరుగుల భాగస్వామ్యం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయామని రహానే(77) అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్ల లయ దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నించామని, అందులో భాగంగానే స్పిన్నర్ల బంతులను బ్యాక్ ఫుట్ తీసుకుని ఆడినట్లు వివరించాడు. రెండో రోజు వృద్ధిమాన్ సాహా(54) స్కోర్లు జట్టుకు ఎంతో కీలకమని, దాంతో కివీస్ పై సులువుగా ఒత్తిడి పెంచుతామన్నాడు.
బ్యాట్స్ మన్ అవుట్ కావడానికి కేవలం ఒక్క బంతి చాలునని, అయితే అదే అతగాడు సెంచరీ సాధిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. గతంలో కంటే ఈడెన్ పిచ్ భిన్నంగా ఉందని, పేస్ బౌలర్లుకు అనుకూలించిందన్నాడు. రెండో సెషన్లో ఉక్కపోత, భారీగా వేడి ఉండటంతో బ్యాట్స్ మన్ ఇబ్బందులు పడ్డారని తెలిపాడు. తొలుత మంచి బ్యాటింగ్ వికెట్ అని భావించామని, అయితే ఈ రోజు మాకు బ్యాడ్ డే అయిందన్నాడు. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more