క్రికెటర్లకు దసరా దమాకా ప్రకటించిన బిసిసిఐ..! BCCI doubles players salary

Bcci doubles players salary

Anurag Thakur, BCCI, BCCI SGM, Cricket, India, Indian Cricket Team, Player salaries, Team India, Indian cricket, cricket, cricket news, sports, sports news

Indian Test players who find themselves in the playing XI on a regular basis are set to become richer in the coming months, with the BCCI doubling their match salaries

క్రికెటర్లకు దసరా దమాకా ప్రకటించిన బిసిసిఐ..!

Posted: 10/02/2016 10:59 AM IST
Bcci doubles players salary

టీమిండియా టెస్టు క్రికెట్ ఆటగాళ్లకు బిసిసిఐ దసరా ధమాకా ప్రకటించింది. అదేంటి అంటారా..? ఎవరైనా దీపావళికి రావాల్సిన బోనస్ లు ఇప్పుడు దసరాకే అందుకుంటున్నారు టీమిండియా టెస్టు క్రికెట్ ఆటగాళ్లు, అదేంటి వాళ్లకు బోసన్ కూడా వుందా అంటారా.? అదేనండీ బోసన్ లా వారికి డబుల్ వేతనం అందుకోనున్నారు, టెస్టు క్రికెట్ ఆటగాళ్ల వేతనాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) భారీగా  పెంచింది. ఇప్పటివరకూ క్రికెటర్ల ఒక్కో టెస్టు మ్యాచ్ కు రూ. 7లక్షలు వేతనం ఉండగా, దాన్ని రూ.15 లక్షలకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
 
అయితే ఈ వేతనం తుది జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లకు మాత్రమే. జట్టుకు ఎంపికై రిజర్వ్ బెంచ్ కు పరిమితయ్యే ఆటగాళ్ల వేతనాన్ని రూ.3 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. దాంతో పాటు బీసీసీఐలో శాశ్వత సభ్యత్వం కల్గిన క్రికెట్ అసోసియేషన్ వార్షిక సబ్సిడీని అరవై కోట్ల నుంచి డబ్బై కోట్లకు పెంచుతూ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నిర్ణయం తీసుకున్నారు.టెస్టు క్రికెట్ ను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దే పనిలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా టెస్టు క్రికెట్ ను బతికించుకోవడానికి చేయాల్సింది చాలానే ఉందని అనురాగ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Thakur  BCCI  BCCI SGM  Cricket  India  Indian Cricket Team  Player salaries  cricket  

Other Articles