ముస్తాక్ తో టీమిండియాను కట్టడి చేయగలరా.? Saqlain Mushtaq to assist England during India tour

Former pakistan spinner saqlain mushtaq to assist england during india tour

Team India, Ashwin, england, England cricket, England cricket team, India Vs England, international cricket, Saqlain Mushtaq, spin bowling, spinner, cricket, cricket

Saqlain Mushtaq, one of Pakistan’s most successful spinners, will assist England’s bowlers during their tour to India next month

ముస్తాక్ తో టీమిండియాను కట్టడి చేయగలరా.?

Posted: 10/26/2016 06:54 PM IST
Former pakistan spinner saqlain mushtaq to assist england during india tour

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భారత అప్రతిహాత విజయం ఇంగ్లాండ్ కు కంటిమీద కునుకును కరువు చేసింది. కివీస్ తో జరిగిన ఐదు టెస్టులను అలవోకగా గెలిచి పర్యాటక జట్టుపై పైచేయిని సాధించిన టీమిండియాను జోరుకు కళ్లెం వేయాలని భావిస్తుంది. ఇందుకోసం పాకిస్తాన్ కు చెందిన మాజీ స్పిన్ దిగ్గజం సక్లాయిన్ ముస్తాక్ ను రంగంలోకి దింపింది. నవంబర్ లో భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో తమ బలహీనతలను అధిగమించడంలో నిమగ్నమైంది.

అశ్విన్ లాంటి స్టార్‌ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంతో పాటు తమ స్పిన్నర్ల నైపుణ్యం కూడా మెరుగుపర్చాలని భావిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ సక్లాయిన్‌ ముస్తాక్‌ను ఈ సిరీస్‌ కోసం తమ స్పిన్‌ కన్సల్టెంట్‌గా నియమించింది. నవంబర్‌ 1న ఇంగ్లండ్‌ జట్టుతో చేరే సక్లాయిన్ 15 రోజుల పాటు ప్రత్యేకంగా జట్టుతో కలిసి పని చేస్తాడు. గతంలోనూ సక్లాయిన్‌ ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు స్పిన్‌ సలహాదారుడిగా వ్యవహరించాడు.

ఇంగ్లండ్ స్పిన్నర్లకు తన సలహాలు ఉపయోగపడతాయన్న ఆశాభావాన్ని సక్లాయిన్‌ వ్యక్తం చేశాడు. భారత్ తో సిరీస్ లో మంచి ఫలితాలు రాబతామని చెప్పాడు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియా పర్యటనలో తనపట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సక్లాయిన్ ఇప్పుడు బ్రిటన్ పౌరుడిగా మారాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Ashwin  england  ind vs eng  Saqlain Mushtaq  cricket  

Other Articles