పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో రాంఛీ వేదకగా సాగిన నాల్గవ వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు.. గుప్తిల్ ఔట్ అయ్యేవరకు భారీ స్కోరు దిశగా సాగినా.. ఆ తరువాత క్రమంగా పెవీలియన్ బాటపట్టింది. అయితే విధ్వంసకర బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ క్రీజులో వుండగా, స్కోరు బోర్డు సింగిల్స్, డబుల్స్ సహా మధ్యమధ్యలో చెత్త బంతులను బండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును కూడా కదించేవాడు.
అయితే రాస్ టేలర్ ను ఔట్ చేయాలని పథకం వేసిన కెప్టెన్, టీమిండియా బౌలర్లకు చిక్కకుండా తన బ్యాట్ తో పరుగులను సాధిస్తూ ముందుకెళ్తున్న టేలర్ ను ధోని పెవీలియన్ కు పంపాడు. అది కూడా గుడ్డిగా. అదెలా అంటారా.. ఇన్నింగ్స్ లోని 46వ ఓవర్లో ఉమేష్ వేసిన బంతిని పైన్ లెగ్ దిశగా అడిన టేలర్ రెండు పరుగులు తీసేందుకు వేగంగా పరిగెత్తి ఒక పరుగును పూర్తి చేసి రెండో పరుగు కోసం మెరుపు వేగంతో వస్తున్నాడు. అదే సమయంలో ధావల్ విసిరిన త్రో ను అందుకునేందుకు ముందుకువచ్చిన ధోని వెనక్కి తిరిగి చూడకుండా దానిని అదే వేగంతో వికెట్లపైకి విసిరాడు.
బంతి స్టంప్స్‌కు తగలడం, టేలర్ రనౌట్ కావడం.. పలు కోణాల్లోని కెమెరాల రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడం.. చకచకా జరిగిపోయాయి. గతంలోనూ ధోని కొన్నిసార్లు ఇలా బంతిని పూర్తిగా అందుకోకుండా వికెట్ల పైకి మళ్లించిన ఘటనలు ఉన్నాయి.. అయితే ఈసారి వికెట్లకు కొంత దూరంగా వుండి కూడా ధోని సరిగ్గా వికెట్లకు తగిలేలా బంతిని విసరగలగడం మ్యాజిక్ గా పేర్కోంటున్నారు అభిమానులు. ఇంకోందరు మాత్రం వికెట్ల వెనకు సూపర్ మ్యాన్ అని, మరికోందరు జార్ఖండ్ డైనమైట్ సేలిందని.. ధోనీపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more