న్యూజీలాండ్ తరువాత వెనువెంటనే సుదీర్ఘ భారత పర్యటనకు వస్తున్న ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సీనియర్ క్రికెటర్ల త్రయానికి అవకాశం లభిస్తుందా..? ఇప్పుడితే క్రీడాభిమానులలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ లతో పాటు సీనియర పేస్ బౌలర్ ఇషాంత్ శర్మల త్రయానికి ఇంగ్లాండ్ తో సీరిస్ లో అవకాశం లభిస్తుందా..? అన్న ప్రశ్న క్రీడాభిమానుల మదిని తొలుస్తుంది.
రమారమి రెండేళ్ల తరువాత కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులో స్థానం లభించినా.. అడే అవకాశం దక్కకపోవడంతో ఇండోర్ లో తన సత్తాను చాటాడు సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్. రెండో ఇన్నింగ్స్ లో అర్థశతకాన్ని నమోదు చేసి సెలక్టర్లకు గిఫ్ట్ గా ఇచ్చాడు. న్యూజీలాండ్ తో సిరీస్ లో అడే అవకాశం లభించినా.. సురేష్ రైనా తరహాలో అరోగ్యం సహకరించక జట్టులోకి రాని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అయితే అనారోగ్యం బారి నుంచి కోలుకున్న ఈయన.. ఫిట్ నెస్ కూడా నిరూపించుకుని బరిలోకి దూకడానికి రెడీ అయ్యాడు.
దీంతో ఆయనను ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలు మెండుగా వున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం (రేపు) సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో వీరద్దరితో పాటు న్యూజీలాండ్ తో రెండో టెస్టులో గాయపడిన శిఖర్ ధావన్ లను ఎంఎస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందా..? లేదా..? సీనియర్ త్రయాన్ని స్థానం కల్పిస్తుందా అన్న విషయమై సర్వత్రా అసక్తి నెలకోంది... ఈ నెల 9 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఎవరి తుది జట్టులో స్థానం లభిస్తుంది..? ఎవరికి నిరాశ ఎదురవుతుందన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more